03 డిసెంబర్ కరెంట్ అఫైర్స్ 2018

  0
  10

  సైంటిస్ట్ నరసింహారావుకు భారత్ వికాస్ అవార్డు
  రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా రమఫోసా
  నూతన సీఈసీగా అరోరా బాధ్యతల స్వీకరణ
  బ్యాడ్మింటన్‌లో సుమీత్ జంటకు డబుల్స్ టైటిల్

  సైంటిస్ట్ నరసింహారావుకు భారత్ వికాస్ అవార్డు
  గుంటూరు జిల్లాకి చెందిన సైంటిస్ట్ గుడికందుల నరసింహారావుకు ‘భారత్ వికాస్ అవార్డు’ లభించింది.
  ఈ మేరకు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో డిసెంబర్ 1న జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జియో ఇంజనీరింగ్ పరిశోధన విధ్యార్థి అయిన నరసింహారావుకు ‘ఇంటలెక్చువల్ సోషల్ రెస్పాన్సబిలిటీస్’ విభాగంలో ఈ అవార్డు దక్కింది. దేశంలో పరిశోధన, విద్యారంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు భారత్ వికాస్ అవార్డును ప్రకటిస్తారు.

  రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా రమఫోసా
  2019 భారత గణతంత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా హాజరు కానున్నారు.
  అర్జెంటీనాలో జరిగిన జీ-20 సదస్సు సందర్భంగా రమఫోసాతో డిసెంబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గణతంత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలని మోదీ ఆహ్వానించగా రమఫోసా అంగీకరించారు.

  *నూతన సీఈసీగా అరోరా బాధ్యతల స్వీకరణ
  భారత ఎన్నికల సంఘం నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ – చీఫ్ ఎలక్షన్ కమిషనర్)గా సునీల్ అరోరా డిసెంబర్ 2న బాధ్యతలు స్వీకరించారు.
  23వ ప్రధాన కమిషనర్‌గా నియమితులైన ఆయన 2021 అక్టోబర్ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. 1980 ఐఏఎస్ బ్యాచ్ రాజస్తాన్ క్యాడర్‌కు చెందిన అరోరా నేతృత్వంలోనే 2019లో 17వ లోక్‌సభకు, ఏపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.

  ఇప్పటివ రకు సీఈసీగా పనిచేసిన ఓపీ రావత్ డిసెంబర్ 1న పదవీ విరమణ చేశారు. రావత్ సీఈసీగా ఉండగా అరోరా ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారు.

  *బ్యాడ్మింటన్‌లో సుమీత్ జంటకు డబుల్స్ టైటిల్
  టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సుమీత్ రెడ్డి-అర్జున్ రామచంద్రన్ జంటకు డబుల్స్ టైటిల్ లభించింది. ముంబైలో డిసెంబర్ 2న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్-అర్జున్ ద్వయం 21-10, 21-16తో టాప్ సీడ్ గో జె ఫె-నూర్ ఇజుద్దీన్ (మలేసియా) జోడీపై విజయం సాధించింది.

  మరోవైపు మహిళల సింగిల్స్‌లో అస్మిత చలిహా, పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ చాంపియన్స్ గా నిలిచారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆసియా జూనియర్ చాంపియన్ లక్ష్య సేన్ 21-15, 21-10తో ప్రస్తుత జూనియర్ ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. అలాగే మహిళల సింగిల్స్‌లో గుమ్మడి వృశాలి, మహిళల డబుల్స్‌లో జక్కంపూడి మేఘన-పూర్వీషా రామ్ జోడీ రన్నరప్‌గా నిలిచారు. వృశాలి 16-21, 13-21తో అష్మిత చేతిలో ఓడిపోయింది.