02 నవంబర్ కరెంట్ అఫైర్స్

  0
  21

  *సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు, ఫొటోతో పోస్టల్ కవర్
  *శరవేగంగా తిరుగుతున్న కృష్ణబిలాన్ని కనుగొన్న భారత్, అమెరికా అబ్జర్వేటరీలు
  *మేరీ కోమ్ 2018 మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ బ్రాండ్ అంబాసిడర్*
  *Unwto ప్రోగ్రామ్ మరియు బడ్జెట్ కమిటీ సమావేశానికి కేంద్ర పర్యాటక మంత్రి k J alphons
  *ప్రవాసం నుంచి తిరిగొచ్చిన మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్

  *సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు, ఫొటోతో పోస్టల్ కవర్

      సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు, ఫొటోతో పోస్టల్ కవర్ ను రూపొందించారు.
  నెల్లూరులో నవంబర్ 1న జరిగిన కార్యక్రమంలో తన పేరుతో ఉన్న పోస్టల్ కవర్ పోస్టర్ ను బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఫొటో ఉండే స్టాంప్లను ఆయనకు చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ కె.బాలసుబ్రహ్మణ్యం బహూకరించారు.

  *శరవేగంగా తిరుగుతున్న కృష్ణబిలాన్ని కనుగొన్న భారత్, అమెరికా అబ్జర్వేటరీలు

      అంతరిక్షంలోని భారత్‌, అమెరికా అబ్జర్వేటరీలు శరవేగంతో తిరుగుతున్న ఒక కృష్ణబిలాన్ని కనుగొన్నాయి. ఇది దాదాపుగా గరిష్ఠస్థాయి వేగంతో తిరుగుతోంది. భారత తొలి ఖగోళ అన్వేషణ ఉపగ్రహం ఆస్ట్రోశాట్‌, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీలు కలసి ఈ ఖగోళ వస్తువును పసిగట్టాయి. ‘4యు 1630-47’ అనే జంట తార వ్యవస్థలో ఈ కృష్ణబిలం కనిపించింది. తాజా కృష్ణబిలం భ్రమణ వేగానికి సంబంధించిన కొలతలను తీసుకోవడంలో ఆస్ట్రోశాట్‌లోని సాఫ్ట్‌ ఎక్స్‌రే టెలిస్కోపు, లార్జ్‌ ఏరియా ఎక్స్‌రే ప్రపోర్షనల్‌ కౌంటర్‌ (ఎల్‌ఏఎక్స్‌పీసీ)లు కీలక పాత్ర పోషించాయని పరిశోధకులు వెల్లడించారు. వీటిని చంద్ర అబ్జర్వేటరీ ధ్రువీకరించింది. 

  *మేరీ కోమ్ 2018 మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ బ్రాండ్ అంబాసిడర్

      ఒలింపిక్ కాంస్య పతక విజేత మరియు ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్, MC మేరీ కొమ్ న్యూఢిల్లీలో మహిళల ప్రపంచ ఛాంపియన్షిప్లో 10 వ ఎడిషన్ బ్రాండ్ అంబాసిడర్గా పేర్కొనబడ్డారు.

  *Unwto ప్రోగ్రామ్ మరియు బడ్జెట్ కమిటీ సమావేశానికి కేంద్ర పర్యాటక మంత్రి k J alphons 

      Unwto ప్రోగ్రామ్ మరియు బడ్జెట్ కమిటీ సమావేశానికి కేంద్ర పర్యాటక మంత్రి k J alphons హాజరయ్యారు. మనామా, బహ్రెయిన్ లో 109th సెషన్ యునైటెడ్ నేషన్స్
  ప్రపంచ పర్యాటక సంస్థ (unwto) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్.
  భారతదేశం 2021 వరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రోగ్రామ్
  మరియు బడ్జెట్ కమిటీ లో సభ్యదేశం గా ఉంటుంది.
  UNWTO యొక్క జనరల్ కార్యదర్శి : Zurab Pololikashvili.

   *ప్రవాసం నుంచి తిరిగొచ్చిన మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్

      జైలు శిక్ష నుంచి తప్పించుకొనేందుకు విదేశాల్లో తలదాచుకున్న మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ రెండేళ్ల అనంతరం స్వదేశానికి తిరిగొచ్చారు. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో మహ్మద్‌ నషీద్‌కు 2015లో 13 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ శిక్షపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. అప్పట్లో వైద్య చికిత్స కోసం బ్రిటన్‌ వెళ్లిన నషీద్‌ అక్కడే ఉండిపోయారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మహ్మద్‌ నషీద్‌ పార్టీ అభ్యర్థి ఇబ్రహీం మహ్మద్‌ సోలీహ్ విజయం సాధించారు. మరోవైపు నషీద్‌కు విధించిన జైలు శిక్షను కొద్ది రోజుల క్రితం దేశ సుప్రీంకోర్టు నిలుపుదలలో ఉంచింది. ఈ నేపథ్యంలో నషీద్‌ తిరిగి మాల్దీవులకు వచ్చారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన మాల్దీవుల తొలి అధ్యక్షుడు నషీద్‌.

  • మాల్దీవుల రాజధాని – మాలె