01 నవంబర్ కరెంట్ అఫైర్స్

  0
  24

  *శాంతినారాయణకు ‘నూతలపాటి’ పురస్కారం
  *ఏపీలో వాహనాలకు ఒకే కోడ్ తో రిజిస్ట్రేషన్ నంబర్లు
  *బోట్స్వానా, జింబాబ్వే, మలావి దేశాల పర్యటనకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  *వైద్యవిధాన పరిషత్ కమిషనర్ గా మాణిక్ రాజ్
  *పటాకులు ఆ రెండు గంటలే
  *‘ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ జాబితాలో ద్రవిడ్‌

  *శాంతినారాయణకు ‘నూతలపాటి’ పురస్కారం

      అనంతపురం జిల్లాకి చెందిన ప్రఖ్యాత నవల, కథా రచయిత డాక్టర్ శాంతినారాయణకు ‘నూతలపాటి సాహితీ పురస్కారం’ లభించింది. ఈ మేరకు సాహితీ పురస్కార కమిటీ అక్టోబర్ 31న ప్రకటించింది. శాంతినారయణ రచించిన ‘బతుకు బంతి’ కథా సంపుటికి ఈ అవార్డు దక్కింది. నవంబర్ 15న తిరుపతిలో జరిగే గంగాధర 79వ జయంతి సాహితీ సభలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. 

  *ఏపీలో వాహనాలకు ఒకే కోడ్ తో రిజిస్ట్రేషన్ నంబర్లు

      ఆంధ్రప్రదేశ్లోని అన్ని కేటగిరీల వాహనాలకు జిల్లాల వారీగా కాకుండా రాష్ట్ర స్థాయిలో ఒకే కోడ్తో రిజిస్ట్రేషన్ నంబర్లను కేటాయించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అక్టోబర్ 31న తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇప్పటిదాకా వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో ఒక్కో జిల్లాకు ఒక్కో కోడ్ తో నంబర్ జారీ చేస్తుండగా ఇకపై జిల్లాల వారీగా కాకుండా రాష్ట్రాన్ని యూనిట్ తీసుకుని ఒకే కోడ్తో నంబర్లు కేటాయించనున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏపీ 38 కోడ్ వరకు నంబర్లు కేటాయించగా మరో 15 రోజుల్లో ఏపీ 39 కోడ్తో కొత్త నంబర్లు కేటాయించనున్నారు. దీంతో ఒకే రాష్ట్రం.. ఒకే కోడ్ను అమలుచేయనున్న మొదటి రాష్ట్రంగా ఏపీ నిలవనుంది. మరోవైపు ప్రభుత్వ వాహనాలకు మాత్రం గతంలో మాదిరిగానే పాత సిరీస్ తో నంబర్లు జారీ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఆర్టీసీ బస్సులకు జడ్, పోలీసు వాహనాలకు పి, ఇతర ప్రభుత్వ వాహనాలకు టీ, యూ, వీ, ఎక్స్, వై.. సిరీస్లతో నంబర్లు జారీ చేస్తామన్నారు. కోడ్ మాత్రం ఏపీ 39తో ప్రారంభమవుతుందని వివరించారు.

  *బోట్స్వానా, జింబాబ్వే, మలావి దేశాల పర్యటనకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

      ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆఫ్రికాలోని 3 దేశాల పర్యటన నిమిత్తం 2018 అక్టోబర్‌ 31న బయలుదేరి వెళ్లారు.

  • బోట్స్‌వానా, జింబాబ్వే, మలావి దేశాల్లో నవంబర్‌ 6వరకు ఆయన పర్యటిస్తారు. వాణిజ్య సంబంధాల బలోపేతంపై మూడు దేశాల అధినేతలతో చర్చిస్తారు.
  • ఆయా దేశాల్లోని భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆయన వెంట కేంద్రమంత్రి కృష్ణపాల్‌ గుర్జార్‌, నలుగురు ఎంపీలతో కూడిన ఉన్నతస్థాయి పార్లమెంటరీ బృందం వెళ్లింది.

  *వైద్యవిధాన పరిషత్ కమిషనర్ గా  మాణిక్ రాజ్

      వైద్య విధాన పరిషత్‌(వీవీపీ) కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి కె.మాణిక్‌రాజ్‌ను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉన్న ఆయనకు వీవీపీ కమిషనర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.

  ‘ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ జాబితాలో ద్రవిడ్‌

      క్రికెట్‌లో విశేష ప్రతిభ కనబర్చిన వారికిచ్చే ‘ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ జాబితాలో భారత మాజీ క్రికెటర్ రాహుల్‌ ద్రవిడ్‌కు చోటు కల్పిస్తూ ఈ ఏడాది జులైలో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌ నుంచి ఐసీసీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు తిరువనంతపురంలో భారత్‌-వెస్టిండీస్‌ మధ్య చివరి వన్డే జరుగుతున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన మెమెంటోను ఆయనకు భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ చేతుల మీదుగా అందించి, అధికారికంగా ఈ జాబితాలో ఆయనకు చోటు కల్పించింది.
  ద్రవిడ్‌ కన్నా ముందు ఈ జాబితాలో నలుగురు భారత క్రికెటర్లకు చోటు దక్కింది. బిషన్‌ సింగ్‌ బేడీ, కపిల్ దేవ్‌, సునీల్‌ గవాస్కర్‌, అనిల్‌ కుంబ్లేల సరసన ఇప్పుడు ఆయన నిలిచారు. తన కెరీర్‌లో ద్రవిడ్ 164 టెస్టులు ఆడి 13,288 పరుగులు చేశారు. అందులో 36 శతకాలు ఉన్నాయి. 344 వన్డేలు ఆడిన ఆయన.. 10,889 పరుగులు చేశారు. అందులో 12 శతకాలు ఉన్నాయి. 2014లో ఆయన ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుతో పాటు ఐసీసీ టెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులను అందుకున్నారు.