01 డిసెంబర్ 2018

  0
  12

  *అమెరికా ఫోర్బ్స్ మేగజీన్లో భారతీయ విద్యార్థి
  *అభినవ్ బింద్రాకు బ్లూ క్రాస్ పురస్కారం

  *అమెరికా ఫోర్బ్స్ మేగజీన్లో భారతీయ విద్యార్థి

  అమెరికన్ ఫోర్బ్స్ మేగజీన్లో అండర్-30 శాస్త్రవేత్తల విభాగంలో భారతీయ విద్యార్థి బొల్లింపల్లి మేఘనకు చోటు లభించింది.
  2018 మేలో ఐసెఫ్ (ఇంటెల్ ఫౌండేషన్ యంగ్ సైంటిస్ట్) అవార్డును సాధించి అత్యంత ప్రతిభాశాలిగా మేఘన గుర్తింపుపొందడంతో ఆమెకు ఈ అవకాశం దక్కింది. ఐసెఫ్ సంస్థ నిర్వహించిన సైన్స్ఫేర్ పోటీల్లో 75 దేశాలతో మేఘన పోటీపడి ‘ఎలక్ట్రోడ్ మేడ్ విత్ ప్లాటినం’ అనే సైన్స్ సూపర్ కెపాసిటర్ ప్రయోగానికి అవార్డును గెలుచుకుంది.

  పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఉనికిలి గ్రామానికి చెందిన మేఘన అమెరికాలోని సెంట్రల్ ఉన్నత పాఠశాలలో ఇంటర్ చదువుతోంది. మేఘన తల్లిదండ్రులు బల్లింపల్లి వెంకటేశ్వరరావు, మాధవి. వీరు అమెరికాలో ఆర్క్నెస్లో లిటిల్రాక్లో నివసిస్తున్నారు.

  *అభినవ్ బింద్రాకు బ్లూ క్రాస్ పురస్కారం

  ఒలింపిక్స్లో వ్యక్తిగత క్రీడల్లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయ షూటర్ అభినవ్ బింద్రాకు ఐఎస్ఎస్ఎఫ్ అత్యున్నత పురస్కారమైన ‘బ్లూ క్రాస్’ లభించింది.
  షూటింగ్ క్రీడకు బింద్రా చేసిన సేవలకుగాను అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) నవంబర్ 30న ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. దీంతో ఈ పురస్కారం పొందిన తొలి భారత షూటర్గా బింద్రా గుర్తింపు పొందాడు. 36 ఏళ్ల బింద్రా… 2008 బీజింగ్ ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ అంశంలో స్వర్ణం సాధించాడు.