హైదరాబాద్‌కు స్వచ్ఛభారత్‌ మిషన్‌ పురస్కారం

  0
  17

  తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు స్వచ్ఛభారత్‌ మిషన్‌ ఉన్నత పురస్కారం లభించింది.

  హైదరాబాద్‌ను బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దడంతో పాటు, ఆయా వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేసినందుకు గాను.. ODF(ఓపెన్‌ డిఫికేషన్‌ ఫ్రీ)గుర్తింపును జారీ చేస్తూ స్వచ్ఛభారత్‌ మిషన్‌ 2019 జనవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది.

  దేశవ్యాప్తంగా ఈ గౌరవాన్ని దక్కించుకున్న మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ 3వ స్థానంలో ఉంది. తాజాగా చండీగఢ్‌, ఇండోర్‌ను ఓడీఎఫ్‌ నగరాలుగా ప్రకటించారు.

  మొత్తం 4,041 నగరాలు గుర్తింపునకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి హైదరాబాద్‌, వరంగల్‌, వికారాబాద్‌ నగరాలున్నాయి.

  స్వచ్ఛ భారత్

  మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా గురువారం 2 అక్టోబర్ 2014 ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 2014 సెప్టెంబరు 24న భారత కేంద్ర కేబినెట్, పట్టణప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్ 2014 అక్టోబర్ 2నుంచి ప్రారంభమై ఐదేళ్ళ పాటు అమలు చేయబడుతుంది.

  ఈ మిషన్ దేశంలోని 4041 పైగా చట్టబద్ధమైన పట్టణాల్లో అమలు చేయబడుతుంది మరియు 62009 కోట్లరూపాయల ఖర్చులో 146273 కోట్లరూపాయలు కేంద్ర ప్రభుత్వం భరించనుంది.

  ఈ మిషన్ స్వచ్ఛ భారత్ అభియాన్ లో పట్టణ విభాగంగా ఉండి పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేయబడనుంది. అయితే, దీని గ్రామీణ విభాగం మాత్రం కేంద్ర తాగునీరు మరియు parishubhram మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేయబడుతుంది.