హెలీనా క్షిపణి పరీక్షలు విజయవంతం

  0
  14

  యుద్ధ ట్యాంకులపై దాడిచేసే అత్యాధునిక క్షిపణి ‘హెలీనా’ను హెలికాప్టర్ నుంచి విజయవంతంగా పరీక్షించారు.

  భారత ఆర్మీ అమ్ములపొదిలో మరో పదునైన ఆయుధం చేరబోతుంది. శత్రువుల యుద్ధ ట్యాంకులను తుత్తునీయలు చేసే అత్యాధునిక యాంటీ ట్యాంక్‌ క్షిపణి ‘హెలీనా’ను ఆర్మీ హెలికాప్టర్‌ నుంచి విజయవంతంగా పరీక్షించారు. 7-8కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని గురి తప్పకుండా ఈ క్షిపణి విధ్వంసం చేసిందని రక్షణ వర్గాలు తెలిపాయి.

  ఒడిశాలోని చాందీపూర్‌ ఐటీఆర్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఈ పరీక్ష నిర్వహించారు. హెలికాప్టర్‌లోని లాంచ్‌ ప్యాడ్‌ నుంచి ఆశించినట్లుగానే లక్ష్యం దిశగా హెలీనా దూసుకెళ్లిందని తెలిపాయి. వాస్తవానికి యుద్ధ ట్యాంకుల నుంచి ప్రయోగించే నాగ్‌ క్షిపణికి ప్రతిరూపమే ఈ క్షిపణి. దీనిని డీఆర్డీవో అభివృద్ధి చేసింది.

  ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజింగ్‌ సీకర్‌(ఐఐఆర్‌)తో పనిచేసే ఈ క్షిపణి కదలికలను తాజా పరీక్షలో టెలిమెట్రీ కేంద్రాల నుంచి పర్యవేక్షించారు. దీంతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానున్నట్లు చెప్పాయి.