హామిల్టన్‌కు ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్

    0
    10

    మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు ఫార్ములావన్ (ఎఫ్1) ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ లభించింది.

    మెక్సికోలో అక్టోబర్ 29న జరిగిన రేసులో 71 ల్యాప్‌లను గంటా 39 నిమిషాల 47.589 సెకన్లలో పూర్తి చేసి నాలుగో స్థానం పొందడంతోపాటు 12 పాయింట్లు సంపాందించాడు. ఈ ప్రదర్శనతో టైటిల్ గెలవడానికి అవసరమైన ఐదు పాయింట్లను హామిల్టన్ సాధించి చాంపియన్ గా నిలిచాడు. మరో రెండు రేసులు మిగిలి ఉన్న ఈ సీజన్‌లో ఓవరాల్‌గా 358 పాయింట్లతో హామిల్టన్(బ్రిటన్) అగ్రస్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. గతంలో హామిల్టన్ 2008, 2014, 2015, 2017లలో ప్రపంచ టైటిల్‌ను గెలిచాడు.

    తాజా విజయంతో హామిల్టన్ ఎఫ్1 టైటిల్‌ను అత్యధికసార్లు గెల్చుకున్న డ్రైవర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఫాంగియో (అర్జెంటీనా) సరసన చేరాడు. మైకేల్ షుమాకర్ (జర్మనీ-7 సార్లు) ‘టాప్’లో ఉన్నాడు. నాలుగుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) 294 పాయింట్లతో ఈ సీజన్‌లో రెండో స్థానానికి పరిమితమయ్యాడు.