హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌సింగ్‌ కి ఉత్తమ ఆటగాడి అవార్డు

  0
  10

  భారత హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌సింగ్‌ ఆసియా హాకీ సమాఖ్య 2018 ఏడాది ఉత్తమ ఆటగాడి అవార్డు లభించినది.

  భారత హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌సింగ్‌ ఆసియా హాకీ సమాఖ్య 2018 ఏడాది ఉత్తమ ఆటగాడి అవార్డు గెలుచుకున్నాడు. ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో సంయుక్త విజేతగా నిలిచిన భారత హాకీ జట్టుకు మన్‌ప్రీత్‌ సారథ్యం వహించాడు. నెదర్లాండ్స్‌లో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో జట్టు రజతం గెలవడంలోనూ మన్‌ప్రీత్‌ ఆటగాడిగా కీలకపాత్ర పోషించాడు.

  మహిళల విభాగంలో భారత టీనేజర్‌ లాల్‌రెమ్‌సియామి వర్ధమాన క్రీడాకారిణి అవార్డు గెలుచుకుంది. 2018 ప్రపంచకప్‌లో ఆకట్టుకున్న ఈ మిజోరాం అమ్మాయి ఆసియా క్రీడల్లో జట్టు రజతం గెలవడంలోనూ పాత్ర పోషించింది. భారత పురుషుల హాకీ జట్టుకు ఉత్తమ ప్రదర్శన అవార్డు దక్కింది.

  మన్ ప్రీత్ సింగ్ పవర్ జూన్ 26 1992 లో జన్మించాడు.

  మే 2017 నుండి భరత్ హాకీ జట్టుకి ప్రాతినిధ్యము వహిస్తున్నాడు.

  అతను భారత్ తరపున 2011 లో మొదటిసారిగా అతనికి 19 సంవత్సరాల వయస్సు ఉన్నపుడు ఆడాడు.