సూర్యుడికి అత్యంత చేరువలో ‘పార్కర్’

    0
    31

    అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన ‘పార్కర్’ అంతరిక్ష నౌక సూర్యుడికి అతి సమీపంలోకి వెళ్లింది.

    దీంతో ఇప్పటివరకు మానవుడు తయారు చేసిన వస్తువుల్లో సూర్యుడి అతి సమీపానికి వెళ్లిన దానిగా పార్కర్ రికార్డు సృష్టించింది. అక్టోబర్ 29 నాటికి సూర్యుడి ఉపరితలానికి ఈ పార్కర్ 4.2 కోట్ల మైళ్ల దూరంలో ఉన్నట్లు పార్కర్ సోలార్ ప్రోబ్ బృందం లెక్కించింది. 

    అంతరిక్ష వాతావరణంపై సూర్యుడి ఉపరితల వాతావరణం చూపే ప్రభావం తదితర రహస్యాలను చేధించేందుకు ఈ ఏడాది ఆగస్టు 12న ‘పార్కర్’ను ప్రయోగించారు. పార్కర్ అలాగే ప్రయాణిస్తూ చివరికి సూర్యుడికి 61.6 లక్షల కిలోమీటర్ల దూరంలో ఆగుతుందని, ఈ అద్భుతం 2024లో చోటు చేసుకునే అవకాశం ఉందని నాసా వెల్లడించింది. 1976 ఏప్రిల్‌లో జర్మన్-అమెరికన్ హీలియోస్-2 అంతరిక్ష నౌక సూర్యుడికి సమీపంలోకి వెళ్లి రికార్డు సృష్టించింది.