సూర్యకాంతి, నీటితో సహజ ఇంధనం – ఐఐటీ జోధ్‌పూర్‌ నూతన ఆవిష్కరణ

  0
  13

  పెట్రోల్‌ ధరల పెరుగుదల, కాలుష్యం అధిక స్థాయికి చేరుతున్న ఇటువంటి తరుణంలో శుద్ధమైన ఇంధన అవసరం చాలా ఉంది. ఇది ఆలోచించిన జోధ్‌పూర్‌ ఐఐటీలోని భారతీయ పరిశోధకులు అందుకు సరికొత్త ఆవిష్కరణ చేశారు.

  మొక్కలో జరిగే కిరణజన్య సంయోగక్రియను ప్రేరణగా తీసుకొని వాహనాలకు ఉపయోగపడే స్వచ్ఛమైన ఇంధనాన్ని తయారు చేసే ప్రక్రియను కనుగొన్నారు. సూర్యకాంతి, నీటిని ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేసే విధంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇటువంటి కొత్త ఆవిష్కరణలకు కెమిస్ట్రీ అద్భుతమైన సాధనంగా ఉపయోగపడింది.

  లాథనైడ్‌ అనే ఉత్ర్పేరకాన్ని ఉపయోగించి నీటిలో ఉన్న ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ అణువులను విచ్ఛినం చేసే మార్గాన్ని కనిపెట్టారు. ఈ ప్రక్రియలో లాథనైడ్‌ను డూప్‌ ఆక్సిజన్‌గా ఉపయోగించారు. ఇది సహజ ఇంధనంగా ఉపయోగపడుతుంది. దీని వల్ల ఎటువంటి హానికారక ఉద్గారాలు వెలువడవు. ఈ ప్రక్రియ హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ టెక్నాలజీని పోలి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు ఐఐటీ జోధ్‌పూర్‌ కెమిస్ట్రీ విభాగాధిపతి రాకేష్‌ ‌కుమార్‌ శర్మ ప్రాతినిధ్యం వహించారు. స్వచ్ఛమైన హైడ్రోజన్‌ కోసం పరిశోధకులు దాదాపు 700 రకాల ఉత్ర్పేరకాల కలయికను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం స్వచ్ఛమైన హైడ్రోజన్‌ చాలా ఖరీదుగా ఉంది. ఈ ప్రక్రియలో CH4(మీథేన్‌)ను 1000డిగ్రీల సెల్సియస్‌ వద్ద వేడి చేయడం వల్ల హైడ్రోజన్‌ను వేరు చేయవచ్చని రాకేష్‌ శర్మ తెలిపారు.

  లాథనైడ్‌ను ఉపయోగించిన హైడ్రోజన్‌ను తొలగించి స్వచ్ఛమైన ఇంధనాన్ని పొందడంలో తమ పరిశోధన బృందం విజయం సాధించిందని ఆయన వెల్లడించారు. ఈ ప్రక్రియకు సూర్యకాంతి అవసరం ఎంతగానో ఉంటుంది. ఇది సంప్రదాయ ఇంధనంతో సమానంగా ఉంటుంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే.. ఇది సంచలనాత్మక సాంకేతిక పరిజ్ఞానంగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ ప్రక్రియ హక్కుల కోసం ఐఐటీ జోధ్‌పూర్‌ దరఖాస్తు చేసింది.