సులభతర వాణిజ్యంలో భారత్ కు 77వ ర్యాంకు

    0
    12

    సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ర్యాంకుల్లో భారత్ కు 77వ ర్యాంకు లభించింది.

    ఈ మేరకు ‘డూయింగ్ బిజినెస్-2019’ నివేదిక ను ప్రపంచబ్యాంకు అక్టోబర్ 31న విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లోని పరిస్థితులను పది పరామితుల ఆధారంగా అంచనా వేసి ప్రపంచబ్యాంకు ఈ ర్యాంకులను ప్రకటించింది. 2014లో 142వ స్థానంలో ఉన్న భారత్.. గత ఏడాది 100కి, ఈ ఏడాది 77కి చేరింది. దీంతో వరుసగా రెండేళ్లు అత్యధిక ర్యాంకులు అధిగమించిన దేశంగా భారత్ గుర్తింపు పొందింది. బ్రిక్స్, దక్షిణాసియా దేశాల్లో అత్యుత్తమ పురోగతి సాధించిన తొలి దేశంగా నిలిచింది. ర్యాంకుల పరంగా 2014లో దక్షిణాసియా దేశాల్లో ఆరో స్థానంలో ఉన్న భారత్ ఈసారి ఒకటో స్థానానికి చేరింది.

    డూయింగ్ బిజినెస్-2019 ర్యాంకుల్లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో నిలవగా సింగపూర్, డెన్మార్క్, హాంకాంగ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అమెరికా 8వ స్థానంలో చైనా 46వ స్థానంలో, పాకిస్థాన్ 136వ స్థానాల్లో నిలిచాయి.