సుప్రీంకోర్టులో కొత్త జడ్జిలు ప్రమాణస్వీకారం

    0
    16

    సుప్రీంకోర్టులో కొత్తగా నలుగురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరి నియామకంతో సర్వోన్నత న్యాయస్థానంలో మొత్తం జడ్జిల సంఖ్య 28కి చేరింది.

    జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌. షా, జస్టిస్‌ అజయ్‌ రస్తోగితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు. వివిధ హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులుగా సేవలందిస్తున్న ఈ నలుగురు జడ్జిలను.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని గురువారం రాష్ట్రపతి.. సుప్రీంకోర్టు కొలీజియానికి తన సమ్మతిని తెలియజేశారు.

    న్యాయమూర్తులు జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ షా, జస్టిస్‌ అజయ్‌ రస్తోగి వరుసగా మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, పట్నా, త్రిపుర హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. కాగా సుప్రీంకోర్టులో ఉండాల్సిన మొత్తం జడ్జిల సంఖ్య 31 మంది. తాజాగా నలుగురు న్యాయమూర్తులను నియమించడంతో ఇంకా ముగ్గురు జడ్జిల స్థానాలు ఖాళీగా ఉన్నాయి.