సీబీఐ డెరైక్టర్ అలోక్ వర్మకు ఉద్వాసన

  0
  9

  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్(సీబీఐ) డెరైక్టర్ అలోక్ కూమార్ వర్మకు కేంద్రప్రభుత్వం జనవరి 10న ఉద్వాసన పలికింది.

  ఈ మేరకు వర్మను సీబీఐ నుంచి ఫైర్ సర్వీసెస్ డెరైక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ తాత్కాలిక డెరైక్టర్ బాధ్యతలను అడిషనల్ డెరైక్టర్‌గా ఉన్న నాగేశ్వర్‌రావుకు అప్పగించింది.

  సీబీఐలో అంతఃకలహాల నేపథ్యంలో 2018, అక్టోబర్ 23న వర్మను ప్రభుత్వం సెలవుపై పంపింది. దీనిపై వర్మ సుప్రీకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆయనను జనవరి 9న పునఃనియమించింది. అయితే వర్మ కేసును మరోసారి పరిశీలించిన అత్యున్నతస్థాయి కమిటీ ఆయనను పదవి నుంచి తొలగించింది.

  వర్మకేసును పరిశీలించిన అత్యున్నతస్థాయి కమిటిలో ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తరఫున జస్టిస్ ఏకే సిక్రి, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఉన్నారు. సీబీఐ చరిత్రలో డెరైక్టర్‌స్థాయి అధికారిపై వేటు పడటం ఇదే మొదటిసారి. 2017, ఫిబ్రవరి 1న సీబీఐ డెరైక్టర్‌గా ఆలోక్ వర్మ బాధ్యతలు చేపట్టారు.