సీబీఐ చీఫ్‌గా అలోక్ వర్మ పునఃనియామకం

  0
  10

  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) డెరైక్టర్‌గా అలోక్ కుమార్ వర్మను పునఃనియమిస్తూ సుప్రీంకోర్టు జనవరి 8న తీర్పు వెలువరించింది.

  అయితే అలోక్‌వర్మ ఎలాంటి ప్రధాన విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా కోర్టు ఆంక్షలు విధించింది. సీబీఐ చీఫ్‌ను నియమించేందుకు, తొలగించేందుకు అధికారం ఉన్న ప్రధాని నేతృత్వంలోని అత్యున్నతస్థాయి త్రిసభ్య కమిటీ అలోక్ వర్మ కేసును పరిశీలించి, ఆయనను సీబీఐ డెరైక్టర్ పదవిలో కొనసాగించాలా, వద్దా అన్నది నిర్ణయించేంత వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని కోర్టు పేర్కొంది.

  సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవ డం, ఈ గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) సిఫారసుల ఆధా రంగా గతేడాది అక్టోబర్‌ 23 అర్ధరాత్రి కేంద్రం వీరిద్దరినీ పదవుల నుంచి తప్పించి సెలవుపై పంపడం తెలిసిందే.

  ప్రభుత్వం తనను అక్ర మంగా పదవి నుంచి తప్పించిందంటూ అలోక్‌ వర్మ వేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు తాజా తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. మరోవైపు అలోక్‌ వర్మకు మళ్లీ డైరెక్టర్‌ పదవిని ఇచ్చినప్పటికీ అధికారాలను కోర్టు కత్తిరించింది కాబట్టి ఇది సమతూకంతో ఉన్న తీర్పు అని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు.