సీఆర్‌పీఎఫ్ 80వ వ్యవస్థాపక దినోత్సవం

  0
  11

  సీఆర్‌పీఎఫ్ 80వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో జాతీయ భద్రత సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ పాల్గొన్నారు.

   
  హరియాణలోని గుర్గావ్‌లో మార్చి 19న జరిగిన ఈ వేడుకల్లో దోవల్ మాట్లాడుతూ… దేశ నాయకత్వం ఎలాంటి విధ్వంసకర ఉగ్రదాడినైనా ఎదుర్కొని అత్యంత సమర్థంగా పోరాడగలదని జాతీయ భద్రతా సలహాదారు ధీమా వ్యక్తం చేశారు.
   
  పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించడాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన సాహస అవార్డులను కూడా ఆయన అందజేశారు.

  1939లో బ్రిటిష్ పాలనలో ‘క్రౌన్ రిప్రజెంటేటివ్స్ పోలీస్’ పేరుతో ఏర్పాటైన ఈ విభాగం పేరును దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949లో సీఆర్‌పీఎఫ్‌గా మార్చారు. ప్రస్తుతం 246 బెటాలియన్లు, 3 లక్షల మంది జవాన్లతో దేశ వ్యాప్తంగా వివిధ రకాలైన కీలక విధులను నిర్వహిస్తోంది. 

   
  సీఆర్‌పీఎఫ్‌ – సెంట్రల్ రీసెర్వ్డ్ పోలీస్ ఫోర్స్ 
   
  నినాదం – సర్వీస్ అండ్ లోయాలిటీ 
   
  1939 జులై 29 న ప్రారంభించారు.
   
  హోమ్ శాఖా అధీనములో పనిచేస్తుంది.