సిక్కిం సీఎంగా తమాంగ్ ప్రమాణస్వీకారం

  0
  10

  సిక్కిం నూతన ముఖ్యమంత్రిగా సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం) అధ్యక్షుడు, పీఎస్ గోలె పేరుతో ప్రజలకు చిరపరిచితులైన ప్రేమ్‌సింగ్ తమాంగ్ మే 27న ప్రమాణస్వీకారం చేశారు.

  సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లోని పల్జోర్ మైదానంలో తమాంగ్‌తోపాటు మరో 11 మంది శాసనసభ్యులచేత కూడా గవర్నర్ గంగా ప్రసాద్ ప్రమాణం చేయించారు. తమాంగ్ ప్రస్తుత శాసనసభలో సభ్యుడు కారు.

  2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. అయినప్పటికీ మే 25న శాసనసభా నేతగా ఎన్నికయ్యారు.

  32 స్థానాలున్న సిక్కిం అసెంబ్లీలో ఎస్‌కేఎం పార్టీ 17 స్థానాలు గెలిచింది. 24 ఏళ్లుగా సిక్కిం ముఖ్యమంత్రిగా ఉన్న పవన్‌కుమార్ చామ్లింగ్ నేతృత్వంలోని ఎస్‌డీఎఫ్ పార్టీ 15 సీట్లు సాధించింది.

  ఈ కార్యక్రమానికి ఎస్కేమ్ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కాగా, సిక్కిం శాసనసభలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఎస్కేఎమ్ పార్టీకి 17 స్థానాలు రాగా, ఎస్డీఎఫ్ పార్టీకి 15 స్థానాలు లభించాయి. కేవలం రెండు స్థానాలు దక్కించుకోకపోవడంతో ఎస్డీఎఫ్ పార్టీకి విజయావకాశాలు తప్పిపోవడం గమనార్హం.