సిక్కింకు ‘ఫ్యూచర్ పాలసీ’ అవార్డు

  0
  11

  100 శాతం ‘సేంద్రియం’గా రికార్డులకెక్కిన సిక్కిం రాష్ట్రానికి ఫ్యూచర్ పాలసీ అవార్డ్ లభించింది. సిక్కిం అనుసరిస్తున్న పర్యావరణహిత విధానాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా పేర్కొంటూ ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ విభాగం ఎఫ్ఏవో 2018 అక్టోబర్ 15న ఈ అవార్డును ప్రదానం చేసింది. ఇటలీలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ సహా మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

  • ఫ్యూచర్ పాలసీ అవార్డ్ గా నామకరణం చేసిన ఈ పురస్కారాన్ని ‘మేలిమి విధానాలకు ఆస్కార్’ గా అభివర్ణిస్తుంటారు.
  • దీన్ని గెలుచుకొనేందుకు 25 దేశాలకు చెందిన 51 నామినేషన్లతో సిక్కిం పోటీపడింది.
  • బ్రెజిల్, డెన్మార్క్, ఈక్వెడార్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
  • ఐక్యరాజ్యసమితికి చెందిన ఎఫ్ఏవో, వరల్డ్ ఫ్యూచర్ కౌన్సిల్(డబ్ల్యూఎఫ్సీ), ఐఎఫ్వోఏఎం-ఆర్గానిక్ ఇంటర్నేషనల్ సంస్థ సంయుక్తంగా
  ఈ అవార్డును ప్రదానం చేస్తుంటాయి.
  • సేంద్రియ వ్యవసాయ విధానాలను అనుసరిస్తున్నట్లు 2003లోనే సిక్కిం అధికారికంగా ప్రకటించింది