సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌కు అంతర్జాతీయ పురస్కారం

  0
  13

  సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌కు బ్రిటన్‌కు చెందిన అచీవ్‌మెంట్‌ ఫోరం ఈ ఏడాదికి ‘మేనేజర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు’ను అందించింది.

  లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ప్రాంగణంలో జరిగిన ఎచీవ్‌మెంట్‌ ఫోరం-2019 కార్యక్రమంలో గ్లోబల్‌ క్లబ్‌ లీడర్స్‌ సంస్థ అధ్యక్షుడు క్రిన్టినా బ్రిగ్స్‌, యూరోప్‌ బిజినెస్‌ అలయన్స్‌ ప్రతినిధి జాన్‌ నెటింగ్‌ల చేతుల మీదుగా శ్రీధర్‌ ఈ అవార్డుతో పాటు జ్ఙాపికను కూడా అందుకున్నారు.

  సింగరేణి సంస్థ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రతిభను చాటుతోందని, వినూత్న సృజనాత్మక ఆలోచనలు, అసాధారణ నాయకత్వం, వ్యాపార నియామకాలను త్రికరణ శుద్ధితో పాటిస్తూ ముందుకు పోతోందని, సామాజిక బాధ్యత కార్యక్రమాల్లోనూ ఉత్తమ సేవలందిస్తోందని గుర్తించి ఈ పురస్కారం అందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

  తెలంగాణాలో సిరుల మాగాణి సింగరేణి. 125 ఏళ్ల క్రితం ఒక చిన్న గ్రామంలో మొదలైన సింగరేణి సంస్థ క్రమక్రమంగా నాలుగు విస్తరించింది. 1920 డిసెంబరు 23న పబ్లిక్ సెక్టార్ కంపెనీగా అవతరించింది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ… దేశంలో వేలాది పరిశ్రమలకు ఇంధనాన్ని అందిస్తున్న నల్ల బంగారుగని ‘సింగరేణి’.

  తరువాతి కాలంలో నిజాం ప్రభువుల ఆధీనంలోకి కంపెనీ వెళ్లింది. సింగరేణిపై అధికారం తరువాత హైదరాబాద్ రాష్ట్రానికి వెళ్లింది.1920లో ఈ సంస్థ పేరును సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా మార్పు చేశారు కాబట్టి ఆ రోజును 93వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నది.

  మొదట్లో చాల కొద్ది ప్రాంతానికే పరిమితమైన ఈ బొగ్గు గనులు కాల గమనంలో ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో విస్తరించి ఉన్న గోదావరి లోయలో 350 కిలో మీటర్ల మేర నిక్షిప్తమై ఉన్న అపార బొగ్గు ఖనిజాన్ని ఈ సంస్థ తవ్వి తీస్తోంది. దక్షిణ భారతదేశంలో సుమారు నాలుగు వేల పరిశ్రమలకు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు కావలసిన ఇంధనం ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంలో కొనసాగుతోంది.