సామాజిక మాధ్యమాల్లో మోదీ హవా

  0
  10

  ప్రపంచ వ్యాప్తము గా అత్యధికులు అనుసరిస్తున్న నాయకుల్లో రెండో స్థానం

  ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రపంచం మొత్తం మీద అత్యధిక ప్రజాదరణ, అనుసరణ కలిగిన రాజకీయ నాయకుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ద్వితీయస్థానంలో ఉన్నట్లు ఓ తాజా నివేదిక వెల్లడించింది.

  ⇒ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రథమస్థానంలో ఉన్నారని డిజిటల్‌ మార్కెటింగ్‌ వేదిక ‘సెమ్‌రష్‌’ మంగళవారం వెల్లడించింది.

  ⇒ అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను సామాజిక మాధ్యమాల్లో 9.6 కోట్ల మంది అనుసరిస్తుండగా ఇప్పుడు మోదీ 11 కోట్ల మంది ఫాలోయర్లతో ట్రంప్‌ను అధిగమించినట్లు ఆ నివేదిక పేర్కొంది.

  ⇒ అయితే, ట్విటర్‌లో మాత్రం అత్యధిక మంది అనుసరిస్తున్న రాజకీయ నాయకుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కోటీ ఇరవై లక్షల మంది అనుసరిస్తున్నారు.