సాక్షుల భద్రత ముసాయిదాకు సుప్రీంకోర్టు ఆమోదం

    0
    2

    వివిధ కేసుల్లో సాక్ష్యం చెప్పే వారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘విట్‌నెస్ ప్రొటెక్షన్ స్కీం’ ముసాయిదాకు సుప్రీంకోర్టు డిసెంబర్ 5న ఆమోదం తెలిపింది.

     

    ఈ మేరకు పార్లమెంట్‌లో చట్టం చేసేంత వరకు అన్ని రాష్ట్రాలు ఈ ముసాయిదాను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది.

    రేప్ కేసులో అరెస్టయిన వివాదాస్పద స్వామీజీ ఆశారాం బాపూ కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు వరుస దాడులకు గురవడంతోపాటు అదృశ్యమవుతున్నారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యంపై గతంలో పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం సాక్షుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలపాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్‌డీ)లను సంప్రదించిన అనంతరం ఈ ముసాయిదాకు కేంద్రం తుదిరూపం దాల్చింది.