సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ

  0
  16

  ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’(ఐక్యతా విగ్రహం)పేరుతో నిర్మించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంను పటేల్ 143వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 31న ఆవిష్కరించారు.

  182 మీటర్ల ఎత్తయిన ఈ విగ్రహం ప్రపంచంలో ఎత్తై విగ్రహంగా గుర్తింపు పొందింది. గుజరాత్‌లోని నర్మదా జిల్లా కేవడియాలో నర్మదా నది నడిబొడ్డున రూ.2,989 కోట్లతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. 2010లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఈ విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

  పటేల్ విగ్రహ నిర్మాణంలో టర్నర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రధాన నిర్మాణదారుగా వ్యవహరించగా దానికి మెయిన్‌హార్డ్, మైఖేల్ గ్రేవ్స్, ఎల్‌అండ్‌టీ సంస్థలు సహకరించాయి. విగ్రహం స్టక్చ్రర్ డిజైన్, ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్, కాంక్రీట్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఎల్‌అండ్‌టీ చేపట్టింది. త్రీ డెమైన్షనల్ స్కానింగ్ టెక్నిక్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ ప్రొడక్షన్ టెక్నిక్‌లను ఉప‌యోగించి కేవలం 33 నెలల్లోనే విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేశారు.

  5 జోన్లుగా విగ్రహం… 
  పటేల్ ఐక్యతా విగ్రహాన్ని 5 జోన్లుగా విభజించారు. మొదటి జోన్‌లో మెమోరియల్ గార్డెన్, మ్యూజియం, రెండో జోన్‌లో 149 మీ. విగ్రహ మే ఉంటుంది. మూడో జోన్‌లో 157 మీ. వరకు గ్యాలరీ, నాలుగో జోన్‌లో మెయింట నెన్స్ ఏరియా, ఐదో జోన్‌లో పటేల్ భుజాలు, తల ఉంటుంది. మూడో జోన్ వరకు సందర్శకులను అనుమతిస్తారు. గ్యాలరీలో ఒకేసారి 200 మంది తిరగవచ్చు. ఈ విగ్రహాన్ని రోడ్డు మార్గంలో నుంచి చూస్తే 182 మీటర్లు, నదీ మార్గం నుంచి చూస్తే 208.5 మీటర్ల ఎత్తు ఉంటుంది.