శనగలో మేలైన జన్యువుల గుర్తింపు

  0
  7

  శనగలో మేలైన లక్షణాలను అందివ్వగల జన్యువులను శాస్త్రవేత్తలు గుర్తించారు.

  దీంతో కరువు కాటకాలను తట్టుకుని ఎక్కువ దిగుబడులు ఇవ్వగల సరికొత్త శనగ వంగడాల అభివృద్ధికి మార్గం సుగమమైంది.

  హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) నేతృత్వంలో జరిగిన ఓ అంతర్జాతీయ పరిశోధన ద్వారా ఈ జన్యువులను గుర్తించారు. పరిశోధనలో భాగంగా దాదాపు 45 దేశాల్లోని 429 రకాల శనగ పంటల జన్యుక్రమాన్ని విశ్లేషించారు.

  ఆర్‌ఇఎన్-1, 3-గ్లుకనేస్, ఆర్‌ఈఎఫ్ 6 అనే జన్యువులను ఇక్రిశాట్ శాస్త్రవేత్త, అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ రాజీవ్ వార్ష్‌ణీ తెలిపారు.

  ఈ పరిశోధనలో ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ), బీజీఐ (చైనా), ఐఆర్‌డీ (ఫ్రాన్‌‌స), ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్), యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్ (బెంగళూరు)లతోపాటు జర్మనీ, కీనా, ఇథియోపియా, కొరియా, అమెరికా, మెక్సికో, ఆస్ట్రేలియాలకు చెందిన పలు పరిశోధన సంస్థలు పాల్గొన్నారుు. ప్రస్తుతం ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్‌గాడాక్టర్ పీటర్ కార్‌బెర్రీ ఉన్నారు.