విద్యుత్ వాడకంలో తెలంగాణకు అగ్రస్థానం

    0
    13

    విద్యుత్ వినియోగం, తలసరి విద్యుత్ వాడకం విషయంలో అత్యధిక వృద్ధి శాతం నమోదు చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానం సొంతం చేసుకుంది.

    2017-18 సంవత్సరానికి విద్యుత్ రంగంలో వివిధ రాష్ట్రాలు సాధించిన పురోగతి వివరాలను కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ) నవంబర్ 3న ప్రకటించింది. ఈ వివరాల ప్రకారం 13.62 శాతం వార్షిక వృద్ధి రేటు తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవగా ఉత్తరప్రదేశ్ 11.92 శాతం వృద్ధి రేటుతో రెండో స్థానం దక్కించుకుంది. అలాగే 7.43 శాతంతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం, 7.40 శాతంతో మహారాష్ట్ర నాలుగో స్థానంలో నిలిచాయి. అదే సమయంలో దేశ సగటు వృద్ధి 6.11 శాతంగా నమోదైంది.

    2016-17లో తెలంగాణ రాష్ట్రంలో 53,017 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగ్గా అది 2017-18లో 60,237 మిలియన్ యూనిట్లకు చేరింది. 2016-17 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 11,35,334 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం కాగా 2017-18లో 12,04,697 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అయింది. ప్రస్తుతం తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్ కో సీఎండీగా దేవులపల్లి ప్రభాకర్‌రావు ఉన్నారు.