విజయవంతంగా ‘అభ్యాస్’ పరీక్ష

    0
    5

    భారత్ మే 13న అభ్యాస్-హైస్పీడ్ ఎక్స్‌పాండబుల్ ఏరియల్ టార్గెట్(హీట్) అనే డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించింది.

    ⇒ ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్‌రేంజ్‌లో ఈ పరీక్షను భారత రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) మే 13న నిర్వహించింది.

    ⇒ ఈ పైలట్ లెస్ టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆటోపైలట్‌ వ్యవస్థ సాయంతో ముందుకు దూసుకెళుతుంది.

    ⇒ ఇందులో చిన్న గ్యాస్ టర్బైన్ ఇంజిన్లతో పాటు దేశీయంగా అభివృద్ధి చేసిన ఎంఈఎంఎస్ నేవిగేషన్ వ్యవస్థను డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు వినియోగించారు.

    ⇒ ఈ ప్రయోగంలో అభ్యాస్ నిర్దేశిత ప్రమాణాలన్నింటిని అందుకుందని డీఆర్‌డీవో వర్గాలు తెలిపాయి.

    ⇒ డీఆర్‌డీవోలోని అన్ని విభాగాల శాస్త్రవేత్తలు, పరిశ్రమ వర్గాలు చిత్తశుద్ధితో రేయింబవళ్లు పనిచేయడం ద్వారా విజయవంతమయ్యామని వివరించారు.