విజయనగరం గిరిజన వర్శిటీకి ఆమోదం

  0
  11

  ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రెల్లిలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం నవంబర్ 8న ఆమోదం తెలిపింది.

   

  ఈ మేరకు వర్సిటీ ఏర్పాటుకు మొదటి విడతలో రూ.420 కోట్ల నిధుల విడుదలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
  ఈ వర్శిటీ ఏర్పాటు తో గిరిజనులకు మరియు అటవీ ప్రాంత వాసులకు మెరుగైన విద్యావకాశాలు అందించేందుకు వీలవుతుంది . మరోవైపు విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)లో కేంద్రప్రభుత్వానికి ఉన్న 73.44శాతం వాటాలను పూర్తిగా ఉపసంహరించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఈ వాటాలను విశాఖ, కాండ్లా, ముంబయి (జేఎన్‌పీటీ), పారాదీప్ ఓడరేవుల సమాఖ్యకు అప్పగించంచనున్నారు.