వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ కు 30 ఏళ్లు

  0
  4

  వరల్డ్‌ వైడ్‌ వెబ్‌(www)కు 30 ఏళ్లు నిండాయి. 1989 మార్చి 12న టిమ్‌ బెర్నర్స్‌లీ దీనిని కనుగొన్నారు.

  వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ను కనిపెట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో సెర్న్‌ కార్యాలయంలో వేడుకల్లో టిమ్‌ మాట్లాడారు.

  మానవాళి కోసం వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ను ఉన్నతంగా మార్చాలని పిలుపునిచ్చారు. ‘నా ఆవిష్కరణ సాంకేతిక విప్లవానికి దారి తీసింది. ప్రజల జీవితాలను ఎంతగానో మార్చేసింది.

  వారు వస్తువులు కొనే, ఆలోచనలను పంచుకునే, సమాచారాన్ని పొందే పద్ధతులను మార్చేసింది. మరెన్నో అద్భుతాలను చేసింది.

  వరల్డ్ వైడ్ వెబ్ (సాధారణంగా “వెబ్ “గా పిలవబడే) ఇంటర్నెట్ ద్వారా కలపబడి ఉన్న హైపర్ టెక్స్ట్ పత్రాల వ్యవస్థ.వెబ్ బ్రౌజరు సహాయంతో మనము వెబ్ పేజిలలో గల అక్షరాలు, చిత్రాలు, చలనచిత్రాలు మరియు ఇతర మల్టిమీడియాను చూడవచ్చు మరియు హైపర్ లింకుల సహాయంతో వాటిమధ్య కదలవచ్చు.అంతకుముందు గల హైపర్ టెక్స్ట్ వ్యవస్థలలోగల భావనలను ఉపయోగించి 1989 లో టిం బెర్నేర్స్-లీ అనే ఆంగ్ల భౌతిక శాస్త్రవేత్త వరల్డ్ వైడ్ వెబ్ ను కనుగొన్నారు.

  ఆయన స్విట్జర్ల్యాండ్ లోని జెనీవాలో గల CERN అనే సంస్థలో పనిచేస్తున్నప్పుడు రాబర్ట్ కైల్లియు అనే బెల్జియం దేశపు కంప్యూటర్ శాస్త్రవేత్త సహాయంతో వెబ్ ను కనుగొన్నారు. టిం బెర్నేర్స్-లీ ఇప్పుడు వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం అనే సంస్థకు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

  1990 లో వీరిరువురు హైపర్ టెక్స్ట్ పుటలను నిలువచేసుకొనే, నెట్ వర్క్ లోని బ్రౌజర్ల ద్వారా చూడగలిగే ‘నోడ్ల యొక్క వెబ్’ ను నిర్మించాలని సూచించి దానిని డిసెంబరు నెలలో విడుదల చేసారు. అప్పటికే ఉన్న ఇంటర్నెట్ ను కలపడానికి ఉపయోగించి ఇతర వెబ్ సైట్లను విశ్వవ్యాప్తంగా తయారుచేయడం జరిగింది మరియు అంతర్జాతీయ ప్రమాణాలతో HTML భాష ఇంకా డొమైన్ పేర్లను తయారుచేసారు.అప్పడినుండి బెర్నేర్స్-లీ వెబ్ ప్రమాణాల (వెబ్ పేజిలను తయారుచేసే మార్క్ అప్ భాష వంటివి) అభివృద్ధికి మార్గదర్శనం చేయడంలో చురుకుగా ఉన్నారు మరియు గత కొన్ని సంవత్సరాలుగా సెమాంటిక్ వెబ్ అనే భావనను ప్రోత్సహిస్తున్నారు.