రైతు బీమా పరిహారం రూ.105 కోట్లు

    0
    13

    రైతుబీమా పథకం కింద ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు రూ.105 కోట్ల పరిహారాన్ని చెల్లించినట్లు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి వెల్లడించారు. ఈ పథకం అమలుపై మంగళవారం భారతీయ బీమా సంస్థ(ఎల్ఐసీ), వ్యవసాయాధికారులతో ఆయన సమీక్ష జరిపారు.

    గత ఆగస్టు 14 నుంచి ఈ పథకం అమల్లోకి రాగా ఇప్పటివరకు 2503 మంది అన్నదాతలు కన్నుమూశారు. వారి తరఫున మొత్తం 2369 మంది పరిహారం కోసం ఎల్‌ఐసీకి దరఖాస్తు చేయగా 2110 మంది నామినీల ఖాతాల్లో రూ.ఐదేసి లక్షల చొప్పున జమచేశారు. కొన్ని దరఖాస్తులను సాంకేతిక కారణాలతో తిరస్కరించగా వాటిని మళ్లీ పూర్తి సమాచారంతో దాఖలు చేస్తున్నట్లు పార్థసారథి చెప్పారు.