రేపటి నుంచే హాకీ ప్రపంచకప్

  0
  10

  ఆరంభోత్సవంలో షారుఖ్, సల్మాన్, రెహమాన్
  భారత్ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ టోర్నీ.. హాకీ ప్రపంచకప్.

   బుధవారమే భువనేశ్వర్ లో టోర్నీ మొదలు కాబోతోంది. ముందు రోజు నిర్వహించే ఆరంభోత్సవంలో సినీ తారలు కనువిందు చేయబోతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్, మాధురీ దీక్షిత్ తదితరులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించబోతున్నారు.
  ప్రపంచకప్ కు ఒలీ (ఒలివ్ రిడ్లే సముద్ర తాబేలు)ని అధికారిక చిహ్నం. ఒడిషాలోని రుషికుల్య, గహిర్మాత బీచ్లకు ఈ అరుదైన ఒలివ్ రిడ్లే తాబేళ్లు వేలాది తరలి వస్తాయి.
  ప్రపంచకప్ కు ఆతిథ్యం ఇవ్వడం భారత్ కు ఇది మూడోసారి. 1982 (ముంబయి), 2010 (దిల్లీ)లో కూడా మన దేశంలో ఈ కప్ జరిగింది.

  అది 1975 హాకీ ప్రపంచకప్ ఫైనల్. హాకీలో భారత్ ఆధిపత్యానికి పాకిస్థాన్ సవాల్ విసురుతున్న రోజులవి. దీంతో ఈ రెండు జట్ల మధ్యఫైనల్ అనేసరికే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. కౌలాలంపుర్లో జరిగిన ఈ టోర్నీలో మలేసియాను ఓడించి భారత్.. జర్మనీపై గెలిచి పాక్ ఫైనల్ కు వచ్చాయి. ఉత్కంఠ పోరులో భారతే గెలిచింది. అయితే ఈ టోర్నీలో ఛాంపియన్ కావడం అనూహ్యమే. అస్లాం ఖాన్ కొట్టిన షాట్ ను పాక్ గోల్ కీపర్ అడ్డుకోగా అతనికి తగిలి వెనక్కి వచ్చిన బంతిని అశోక్ మళ్లీ నెట్లోకి పంపాడు. అయితే రిఫరీ వెంటనే గోల్ ఇవ్వకపోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. బంతి గోల్ లైన్ దాటలేదని పాక్ ఆటగాళ్లు వాదనకు దిగినా రిఫరీ గోల్ ప్రకటించాడు. ఫైనల్ను మలుపు తిప్పిన ఘటన అదే. అప్పుడు వెనుకబడిన పాక్ చివరిదాకా పోరాడినా ఫలితం లేకపోయింది.. ఆఖరి క్షణం వరకు ప్రత్యర్థిని కాచుకున్న భారత్ విజయభేరి మోగించింది. జట్టు విజయంలో గోల్ కీపర్ అశోక్ దివాన్ కీలకపాత్ర పోషించాడు.