రెండేళ్ల పాటు భారత్‌ వృద్ధి 7.3% :మూడీస్‌

  0
  7

  భారత ఆర్థిక వ్యవస్థ 2019, 2020 సంవత్సరాల్లో 7.3 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉందని అమెరికాకు చెందిన రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ అంచనా వేస్తోంది.

  ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ వ్యయాలకు సంబంధించి చేసినప్రకటనలు సమీప భవిష్యత్‌లో వృద్ధికి దోహదపడనున్నట్టు తెలిపింది.

  2019-20 మధ్యంతర బడ్జెట్‌లో భాగంగా రైతులకు నేరుగా నగదు బదిలీ చేయడంతోపాటు మధ్య తరగతి వర్గాలకు పన్ను భారం తగ్గించే ప్రకటనలు చేసినందు వల్ల ఆర్థిక పరంగా ఊతం లభిస్తుందని, దీంతో జీడీపీ 0.45 శాతం వృద్ధికి అవకాశం ఉంటుందని మూడీస్‌ పేర్కొంది.

  జీఎస్టీ అమలు భారత పరపతి రేటింగ్‌కు సానుకూల అంశమని అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంటున్నది. జీఎస్టీ అమలుతో పన్ను వసూళ్ల పరిధి, ఆర్థిక వృద్ధిరేటు పెరుగనుందన్న మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్.. ఈ పరిణామం భారత్ పరపతి రేటింగ్ పెరిగేందుకు దోహదపడనుందని తెలిపింది. మధ్యకాలికంగా చూస్తే, జీఎస్టీతో పెరుగనున్న వ్యాపార సానుకూలత ఆర్థిక వృద్ధి పుంజుకోవడానికి, ఉత్పాదకత మెరుగుపడటానికి దోహదపడనుంది. 

  దేశమంతా ఏకీకృత మార్కెట్‌గా మారడంతో మరిన్ని విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది అని మూడీస్ వైస్ ప్రెసిడెంట్ విలియమ్ ఫోస్టర్ అన్నారు. జీఎస్టీతో ప్రభుత్వ రెవెన్యూ పెరుగనుందని, పన్ను ఎగవేతలు తగ్గనున్నాయని ఈ రెండు అంశాలు కూడా ఇండియా రేటింగ్‌కు అనుకూలం కానున్నాయని అన్నారు.