రూ.3వేల కోట్లతో సైనిక సంపత్తి కొనుగోలు

  0
  5

  సూపర్‌సోనిక్‌ బ్రహ్మోస్‌ క్రూయిజ్‌ క్షిపణి సహా రూ.3వేల కోట్ల విలువైన సైనిక సంపత్తి కొనుగోలుకు రక్షణ శాఖ 2018 డిసెంబర్‌ 1న ఆమోదం తెలిపింది.

  • రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ నాయకత్వంలో సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ)లో ఈ నిర్ణయం జరిగింది. 100 కోట్ల డాలర్లతో రెండు స్టెల్త్‌ ఫ్రిగేట్‌ యుద్ధనౌకను కొనుగోలు చేస్తారు.
  • ఈ రెండు నౌకల్లోనూ దేశీయంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్‌ క్షిపణును అమరుస్తారు. యుద్ధ క్షేత్రంలో మొరాయించే ప్రధాన యుద్ధ ట్యాంకు ‘అర్జున్‌’ను మరమ్మతు కోసం తరలించడానికి ఉపయోగించే సాయుధ రికవరీ వాహనాలు (ఏఆర్‌వీ) సమీకరించడానికి కూడా డీఏసీ ఆమోదం తెలిపింది.
  • వీటిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించింది. ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ బీఈఎంఎల్‌ వీటిని ఉత్పత్తి చేస్తుంది.