రిలయన్స్‌ బోర్డు అదనపు స్వతంత్ర డైరెక్టరుగా అరుంధతీ భట్టాచార్య.

    0
    15

    ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(RIL) బోర్డులో అదనపు స్వతంత్ర డైరెక్టరుగా, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RIL) మాజీ ఛైర్మన్‌ అరుంధతీ భట్టాచార్య నియమితులయ్యారు.

    ఆమె 5 సం॥ల పదవీకాలం 2018 అక్టోబర్‌ 17 నుంచి ప్రారంభమైందని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో RIL వెల్లడించింది.
    దేశీయ ఆర్థిక రంగంలో 40 సంవత్సరాల అనుభవం భట్టాచార్యకు ఉంది. అరుంధతీ భట్టాచార్య SBIకి తొలి మహిళా ఛైర్మన్‌. అరుంధతీ భట్టాచార్య హయాంలోనే 5 అనుబంధ బ్యాంకుతో పాటు భారతీయ మహిళా బ్యాంకును కూడా SBIలో విలీనం చేశారు. ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ క్రిస్‌ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ ఏఏపీ సలహాదారుగా కూడా అరుంధతీ భట్టాచార్య నియమితులయ్యారు.