మే 7 : రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి

  0
  54

  శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1861 మే 7 వ తేదీన జన్మించాడు.

  1913 లో గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి. విశ్వకవి అనే బిరుదును సాధించి పెట్టింది

  రవీంద్రుడు వ్రాసిన “జనగణమణ” ను రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న జాతీయ గీతంగా వందేమాతరంను జాతీయ గేయంగా ప్రకటించాడు.

  రవీంద్రుని రచనలలో గీతాంజలి చాల గొప్పది. రవీంద్రుడు తాను బెంగాలీ భాషలో రచించిన భక్తిగీతాలను కొన్నింటిని ఆంగ్లంలోనికి అనువదించి గీతాంజలి అని పేరు పెట్టాడు. అది అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడింది.

  ప్రపంచ సాహిత్యంలో ఇది గొప్ప రచన. మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం.

  శాంతినికేతన్‌ స్థాపన: 1901 డిసెంబరు.
   గీతాంజలికి నోబెల్ బహుమతి: 1913 నవంబరు.
   విశ్వభారతి స్థాపన: 1921 డిసెంబరు.
   మరణం: 1941, ఆగస్టు 7.
   ఆత్మకథ: మై రెమినిసెన్సెస్