మే 22 కరెంట్ అఫైర్స్ 2019

  0
  6

  # ఇండోనేషియా అధ్యక్షుడిగా జోకో విడోడో
  # భారత పోలీసు అధికారికి ఐరాస పురస్కారం
  # ఐరోపా ఎన్నికల్లో ఎస్తోనియన్ల ఆన్‌లైన్ ఓటింగ్

  ఇండోనేషియా అధ్యక్షుడిగా జోకో విడోడో

  ఇండోనేషియా అధ్యక్షుడిగా జోకో విడోడో మరోసారి ఎన్నికయ్యారు. 2019 ఏప్రిల్ 17న ఇండోనేషియా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలను మే 20న ఆ దేశ ఎన్నికల సంఘం విడుదల చేసింది. విపక్ష నేత మాజీ ఆర్మీ జనరల్, ప్రత్యర్థి ప్రబోవో సుబియాంటోపై జోకో విడోడో రెండోసారి విజయం సాధించారని ఈసీ ప్రకటించింది. విడోడో నేతృత్వంలోని ఇండోనేషియా డెమోక్రటిక్ పార్టీకి 55.5శాతం, ప్రబోవో సుబియాంటోకు 44.5శాతం ఓట్లు వచ్చినట్లు పేర్కొంది.

  భారత పోలీసు అధికారికి ఐరాస పురస్కారం

  శాంతి పరిరక్షణలో అసువులు బాసిన భారతదేశ పోలీసు అధికారి జితేందర్‌ కుమార్‌కు ఐక్యరాజ్యసమితి హామర్‌షల్డ్‌ పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. మే 24 న జరిగే అంతర్జాతీయ శాంతిస్థాపకుల దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమంలో భారత శాశ్వత ప్రతినిధి ఈ పురస్కారాన్ని అందుకుంటారు. కాంగో దేశంలో సేవలు అందిస్తూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది విధి నిర్వహణలో మరణించిన మొత్తం 119 మంది మిలటరీ, పోలీసు అధికారులకు ఐరాస ఈ పురస్కారాన్ని అందజేయనుంది.

  ఐరోపా ఎన్నికల్లో ఎస్తోనియన్ల ఆన్‌లైన్ ఓటింగ్

  ఐరోపా పార్లమెంట్‌కు తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ఎస్తోనియన్లు ఆన్‌లైన్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
  దీంతో ప్రపంచంలో ఆన్‌లైన్ ఓటింగ్‌ను వినియోగించుకున్న తొలిదేశంగా ఎస్తోనియా రికార్డులకెక్కింది. ఈ ఎన్నికల్లో సాధారణ ఎన్నిక గడువుకు నాలుగు రోజుల ముందే ఇంటర్నెట్ ఓటింగ్ ముగుస్తుంది. ఈ విధానంలో ఓటర్లు బహుళ సంఖ్యలో ఓట్లను వేసేందుకు అనుమతిస్తారు. అయితే చివరి ఓటును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

  2019, మే 23-26 తేదీల మధ్య ఐరోపా పార్లమెంట్‌లోని 751 స్థానాల కోసం 28 సభ్యదేశాలలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఐరోపా పార్లమెంట్‌లో 13 లక్షల జనాభా కలిగిన చిన్న దేశం ఎస్తోనియాకు ఆరుగురు ప్రతినిధులు ఉన్నారు. ఎస్తోనియాలో ఇంటర్నెట్ ఓటింగ్ (ఐ ఓటింగ్) 2005లోనే అందుబాటులోకి వచ్చింది