మే 08 కరెంట్ అఫైర్స్ 2019

  0
  18

  # షార్ఫ్‌ షూటర్‌ నవాబ్‌ అలీఖాన్‌ రికార్డు
  # మైక్రోసాఫ్ట్‌ ప్రపంచ పోటీలో రన్నరప్‌గా భారత్
  # చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం

  షార్ఫ్‌ షూటర్‌ నవాబ్‌ అలీఖాన్‌ రికార్డు

  62వ నేషనల్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షి్‌పలో తెలంగాణ తరపున పాల్గొన్నహైదరాబాద్‌ షార్ఫ్‌షూటర్‌ నవాబ్‌ షఫాత్‌ అలీఖాన్‌ ప్రధమ స్థానం సాధించారు.

  ఏప్రిల్‌ 20నుంచి 29వరకు మధ్యప్రదేశ్‌ మహవ్‌లోని ఆర్మీ మాక్‌మాన్‌షిప్‌ యూనిట్‌లో నిర్వహించిన ఈపోటీల్లో ‘బిగ్‌బోర్‌ వెటరన్‌ ఈవెంట్‌’లో 524 పాయింట్లు సాధించి ప్రధమ స్థానంలో నిలిచారు. తెలంగాణ రైఫిల్‌ అసోసియేషన్‌లో అలీఖాన్‌కు ‘సీనియర్‌ మోస్ట్‌ టార్గెట్‌ షూటర్‌’గా పేరుంది.

  తన 11 ఏటనే చెన్నైలో నిర్వహించిన 12వ నేషనల్‌ గేమ్స్‌ ఆఫ్‌ ఇండియా పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ తరపున పాల్గొని సబ్‌జూనియర్‌ షూటర్‌ అవార్డును కైవశం చేసుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకూ (1968- 2019) పలు రైఫిలింగ్‌ పోటీల్లో పాల్గొన్న దేశంలోనే సీనియర్‌ మోస్ట్‌ షూటర్‌గా గుర్తింపు పొందారు.

  మైక్రోసాఫ్ట్‌ ప్రపంచ పోటీలో రన్నరప్‌గా భారత్

  మైక్రోసాఫ్ట్‌ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘ఇమేజిన్‌ కప్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌’లో భారత్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు రెండో స్థానంలో (ఫస్ట్‌ రన్నరప్‌గా) నిలిచారు.

  వీరు స్మార్ట్‌ ఆటోమేటెడ్‌ కాలుష్య నిరోధక, ఔషధ బట్వాడా మాస్క్‌ను తయారుచేశారు. ఇలాంటి సాధనాన్ని రూపొందించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఆకాశ్‌, వాసు కౌశిక్‌, భరత్‌ సుందల్‌లు ఈ ఘనత సాధించారు. *ఆస్థమా, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలున్న రోగులకు ఉపయోగపడే ‘సేలి’ అనే సాధనాన్ని వీరు రూపొందించారు.

  ఫిబ్రవరిలో సిడ్నీలో జరిగి ఆసియా ప్రాంతీయ తుది పోటీలో ఇది మొదటి స్థానంలో నిలిచింది. మొదటి బహుమతిని అమెరికాకు చెందిన ‘టీమ్‌ ఈజీగ్లూకోజ్‌’ గెల్చుకుంది. ఈ బృందానికి లక్ష డాలర్ల బహుమతి, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యా నాదెళ్ల నుంచి మార్గనిర్దేశ ఉపన్యాసం లభిస్తుంది. ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచిన భారత బృందానికి సర్ఫేస్‌ ల్యాప్‌టాప్‌లు, 40వేల డాలర్లు దక్కుతాయి.

  చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం

  అక్షయ తృతీయను పురస్కరించుకుని ఉత్తరకాశీ జిల్లాలోని యమునోత్రి, గంగోత్రి దేవాలయాలను తెరిచారు.

  ఈ ఏడాది చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభమైంది. దీనికి ముందు గంగా, యమునల విగ్రహాలను శీతాకాల విడిది అయిన ముఖ్బా, ఖర్సాలీ నుంచి తీసుకొచ్చారు. దీంతో గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌లతో కూడిన చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభమైంది. మే 9న కేదార్‌నాథ్‌ ఆలయాన్ని, తర్వాత రోజున బద్రీనాథ్‌ ఆలయాన్ని తెరుస్తారు. విపరీతంగా మంచు కురుస్తుందని ఈ నాలుగు ఆలయాలను ఏటా అక్టోబర్‌ -నవంబర్‌ నెలల్లో మూసివేసి ఏప్రిల్‌- మే నెలల్లో తెరుస్తారు.