మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రారంభము

  0
  12

  మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రారంభ కార్యక్రమాన్ని 2018 నవంబర్ 21న ఉండవల్లిలోని ప్రజావేదికలో నిర్వహించారు.

  • ఈ కార్యక్రమంలో ఐటీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి లోకేశ్ ముఖ్యఅతిథిగా హాజరై మేక్ ఇన్ ఏపీ వెబ్సైట్, పోస్టర్ ను ఆవిష్కరించారు.
  • ఐడియాల్యాబ్స్ నాలెడ్జ్ భాగస్వామిగా నాస్కామ్ 10,000 స్టార్టప్ సంస్థలు, ఏపీ ఇన్నోవేషన్ వ్యాలీ సంయుక్తంగా మేక్ ఇన్ ఏపీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. వ్యవసాయం, ఆరోగ్యం, రవాణా, వాతావరణం, స్మార్ట్ గవర్నెన్స్, ఆదర్శ నగరాలకు సంబంధించి కృత్రిమ మేధస్సు (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), డాటా అనటిక్స్, బ్లాక్ చైన్, వర్చువల్ రియాల్టీ మార్గాల ద్వారా పరిష్కార మార్గాలను కనుగొనేందుకు సవాళ్లను యువతకు ఇవ్వనున్నారు. ప్రతిభ కనబరిచిన సంస్థలు, బృందాలకు నగదు బహుమతులు అందిస్తారు.
  • మేక్ ఇన్ ఏపీలో 100కు పైగా మెంటార్లు (మార్గదర్శకు) భాగస్వాములుగా ఉంటారు. 25కు పైగా కార్పొరేట్ కంపెనీలు, 100కు పైగా కళాశాలలు భాగస్వాములుగా ఉంటాయి.
  • ఇన్నోవేషన్ వ్యాలీ సీఈవో విన్నీపాత్రో రెండు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీ అభివృద్ధికి సహకారం కోసం ఐడియా ల్యాబ్స్ సీఈవో పంకజ్ దివాన్, బ్లాక్ చైన్ ఎకోసిస్టం ఏర్పాటుపై సహకారం అందించేందుకు ఎలెవన్ ఓ వన్ సీఈవో రమ అయ్యర్తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.