ముగ్గురు శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్

    0
    13

    జీవ పరిణామ సిద్ధాంతం ఆధారంగా పరిశోధనలు సాగించిన ముగ్గురు శాస్త్రవేత్తలకు 2018 సంవత్సరానికిగాను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది

    ఈ మేరకు ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్(అమెరికా), జార్జ్ స్మిత్(అమెరికా), గ్రెగరీ వింటర్(బ్రిటన్)లు ఈ పురస్కారానికి ఎంపికైనట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అక్టోబర్ 3న ప్రకటించింది.

    జీవ ఇంధనాల నుంచి ఔషధాల వరకు మానవాళికి ఉపయోగపడే పదార్థాల తయారీకి దోహదపడే ఎంజైమ్‌లను వీరు జీవ పరిణామ సిద్ధాంతం ప్రాతిపదికగా సృష్టించారు. రసాయన శాస్త్రంలో నోబెల్ పొందిన 5వ మహిళగా ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్ గుర్తింపు పొందారు. సుమారు రూ.7.40 కోట్ల ప్రైజ్‌మనీని ఆర్నాల్డ్ సగం..స్మిత్, వింటర్‌లు మిగతా సగాన్ని పంచుకోనున్నారు.