మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా మహ్మద్ సోలి

  0
  16

  మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా ఇబ్రహీం మహ్మద్ సోలి నవంబర్ 17న ప్రమాణస్వీకారం చేశారు.
  సోలి ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు.

  ఈ సందర్భంగా సోలితో సమావేశమైన మోదీ పలు అంశాలపై చర్చలు జరిపారు. అభివృద్ధి, శాంతి కోసం మాల్దీవులు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రధాని హోదాలో మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి.

  ఇప్పటివరకు మాల్దీవుల అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్లా యామీన్ హయాంలో భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. చైనాకు అనుకూల వ్యక్తిగా పేరొందిన యామీన్.. ఆ దేశంలో అత్యవసర పరిస్థితి విధించడాన్ని భారత్ వ్యతిరేకించింది.
  మాల్దీవులు ప్రపంచములోనే అతి చదునైన దేశముగా పేరుగాంచింది. దేశములోని అత్యున్నత స్థానము కేవలం 2.3 మీటర్లే. పెరుగుతున్న సముద్రమట్టము మాల్దీవుల ఉనికికి ప్రమాదకారిగా మారే అవకాశమున్నదని నివేదికలు వచ్చినప్పటికీ, వాస్తవానికి ఇటీవలి దశకాలలో సముద్రమట్టము కొంచెం తరిగినది.

  2004లో హిందూ మహాసముద్రములో సంభవించిన సునామీ వల్ల మాల్దీవులలోని కొంతభాగము జలమయమై అనేకమంది ప్రజలను నిర్వాసితులను చేసింది. ఈ వినాశనము తర్వాత, కార్టోగ్రాఫర్లు సునామీ వల్ల రూపాంతరము చెందిన దీవుల యొక్క పటాలను తిరిగి గీసే ప్రయత్నాలు చేస్తున్నారు. మాల్దీవుల ప్రజలు మరియు ప్రభుత్వము ఎప్పుడో ఒకప్పుడు మాల్దీవులు సముద్రపటమునుండి తుడిచిపెట్టుకుపోయే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు.