మార్చ్ 30 న ‘ఎర్త్‌ అవర్’

  0
  15

  విద్యుత్తు పొదుపుపై ప్రజల్లో చైతన్యం నింపడానికి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్ నేచర్‌(డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) సంస్థ ఏటా మార్చి చివర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.

  ఒక గంట పాటు ఇళ్లల్లో, కార్యాలయ్యాల్లో విద్యుత్తు వాడకుండా ఉండి, పర్యావరణ పరిరక్షణకు మద్దతు తెలపడమే దీని ఉద్దేశం. 

  ఈ సంవత్సరం ఎర్త్‌ అవర్‌ మార్చి ౩౦న రాత్రి 8:30 నుంచి 9:30 గంటల మధ్యలో జరగింది 2019 ఈ కార్యక్రమ ఇతివృత్తం గా ‘కనెక్ట్‌ 2 ఎర్త్‌’ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌’ను షేర్‌ చేస్తు మద్దతు తెలిపారు.

  ఎర్త్‌ అవర్‌

  పర్యావరణ పరిరక్షణ కోరుతూ 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఎర్త్‌ అవర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

  క్రమేపి ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ప్రస్తుతం సుమారు 187 దేశాల్లోని 7000 నగరాల్లో ఎర్త్‌ అవర్‌ కార్యక్రమాన్ని నిర్వహించి, పర్యావరణ పరిరక్షణలో తమవంతు భాగస్వామలవుతున్నారు.

  ఎర్త్‌ అవర్‌ నిర్వహించే ప్రముఖ భవనాలు

  ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా చారిత్రక కట్టడాలు, అధికారిక భవనాలు వేదికగా నిలుస్తున్నాయి.

  సిడ్నీ ఒపెరా హౌస్‌, ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌, ఈఫిల్‌ టవర్‌, కార్నబీ స్ట్రీట్‌, బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌, ఎడిన్బర్గ్‌ కోట తదితర కట్టడాలన్నింటిలో దీనిని నిర్వహించారు.