మార్చి 24 న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం

    0
    13

    2019కి గాను ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం యొక్క థీమ్ – “ఇట్స్ టైం”

    క్షయ వ్యాధి (Tuberculosis) ఒక ముఖ్యమైన అంటువ్యాధి. ఇది ఊపిరితిత్తులకు సంబంధించినదని మనకు తెలిసినా, చర్మము నుండి మెదడు వరకు శరీరంలో ఏ భాగనికైనా ఈవ్యాధి సోకవచ్చును. భారతదేశంలో దీర్ఘకాలిక రోగాలలో ముఖ్యమైనది క్షయవ్యాధి. మైకోబాక్టీరియా లేదా మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమివలన ఈ వ్యాధి వస్తుంది. క్షయ వ్యాధి సోకని శరీరావయవాలు క్లోమము, థైరాయిడ్ గ్రంథి, జుట్టు. మిగిలిన అవయవాలన్నింటికి క్షయవ్యాధి కలిగే అవకాశం ఉంది. ఈ వ్యాధి ముఖ్యంగా శ్వాసకోశాన్ని దెబ్బ తీస్తుంది.

    డా. రాబర్ట్ కోచ్ క్షయ వ్యాధికారక సూక్ష్మక్రిములను మొదటిసారిగా మార్చి 24, 1882 న గుర్తించారు. ఇందుకుగాను 1905 లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 24 న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం నిర్వహించబడుతుంది.

    సూక్ష్మక్రిముల్ని గుర్తించడం వీటిలో ముఖ్యమైన పరీక్షలు. కొద్ది నెలల తేడాలో ఆకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, రాత్రి పూట స్వల్పస్థాయిలో జ్వరం రావడం, జ్వరం వచ్చినప్పుడు బాగా చెమట పట్టడం, నెలల తరబడి తగ్గని దగ్గు వంటివి ముఖ్యమైన రోగలక్షణాలు.

    ఎప్పుడైతె క్షయ జబ్బు ఉన్నవారు దగ్గినా, తుమ్మినా లేదా వూసినా, గాలి ద్వారా వేరే వారికి అంటుకుంటుంది. ప్రపంచ జనాభాలో ప్రతి ముగ్గురులో ఒక్కరికి ఈ వ్యాధి సోకుతుంది. ప్రస్తుతం క్షయ నిర్ధారణకు వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి, పరిశోధనశాలల్లో బ్యాక్టీరియాను అభివృద్ధి చేస్తున్నారు. దీనికి దాదాపు ఎనిమిది వారాల సమయం పడుతుంది. ఇంతకంటే వేగంగా పనిచేసే పరీక్షలు ఉన్నప్పటికీ అవి అన్ని రకాల క్షయ బ్యాక్టీరియాలను గుర్తించలేవు. క్షయ వ్యాధి నిర్ధారణకు ఇకపై వారాల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క గంటలో వ్యాధి తాలూకూ బ్యాక్టీరియాను గుర్తించేందుకు డీఎన్‌ఏ ఆధారిత పద్ధతిని అభివృద్ధి చేసినట్లు బ్రిటన్ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హెచ్‌పీఏ) శాస్తవ్రేత్తలు ప్రకటించారు.