మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐక్య రాజ్య సమితి

  0
  12

  జైషే మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ను ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.

  ⇒ అతడిని ఐరాస బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టకుండా చైనా నాలుగు సార్లు అడ్డుకున్నప్పటికీ చివరికి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అజార్‌ విషయంలో చైనా పెట్టిన అభ్యంతరాలను వెనక్కి తీసుకోవడంతో ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా తేల్చడానికి మార్గం సుగమం అయింది.

  ⇒ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంతో అతని ఆస్తులు ఇతరత్రా విదేశాల్లో ఉంటే జప్తు చేసేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చు.

  ⇒ చైనా దాదాపు ఐదు సార్లు మసూద్‌ను ఐరాస నుంచి కాపాడింది. కానీ ఈ సారి మాత్రం కాపాడేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. అలాగని చైనా-పాక్‌ ఆర్థిక నడవా పనులు జరుగుతున్న పాక్‌ను వదులుకున్నట్లు కాదు.

  ⇒ మసూద్‌పై నిషేధం విధించగానే పాక్‌లో ఉగ్రవాదం పాతాళానికిపడిపోయే పరిస్థితి లేదు. అదే జరిగేట్లైతే లష్కరే అధినేత హఫీజ్‌ సయీద్‌ స్వేచ్ఛగా తిరిగేవాడు కాదు.

  ⇒ నిషేధం విధించిన సంస్థల పేర్లు మార్చి నిర్వహిస్తారు. కాకపోతే ఇది అంతర్జాతీయ వేదికపై భారత్‌ పరపతికి, అంతర్గతంగా అధికార పార్టీ ఎన్నికలకు సంబంధించిన అంశం. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో పాక్‌ ప్రధాన ప్రచారాస్త్రం అన్న విషయం తెలిసిందే. ఇరాన్‌ విషయంలో ట్రంప్‌ వైఖరితో భారత్‌లో కొంత అసంతృప్తి ఉంది. చైనాకు ఈ విషయం బాగా తెలుసు.