మన్మోహన్‌సింగ్‌కు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం-2017 ప్రదానం

  0
  10

  భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ 2018 నవంబర్‌ 19న డిల్లీలో ఇందిరాగాంధీ శాంతి పురస్కారం-2017 అందుకున్నారు.
  మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ సమక్షంలో పురస్కారాన్ని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకుర్‌ ప్రదానం చేశారు.

  డిల్లీకి చెందిన పర్యావరణ మేధో సంస్థ ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌(సీఎస్‌ఈ)’కు ‘ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి పురస్కారం-2018’ దక్కింది. పర్యావరణ విద్య, పరిరక్షణలో చేసిన కృషిని గుర్తించి ఈ బహుమతికి ఎంపిక చేశారు.

  భారతదేశ 13వ ప్రధానమంత్రి
  పదవీ కాలము
  2004 మే 22 – 2014 మే 26

  వ్యక్తిగత వివరాలు
  జననం – 1932 సెప్టెంబరు 26 (వయస్సు: 86 సంవత్సరాలు)
  పంజాబ్ (ఇప్పటి చక్వాల్ , పాకిస్తాన్)
  జాతీయత – భారతీయుడు
  రాజకీయ పార్టీ- – భారత జాతీయ కాంగ్రెస్
  జీవిత భాగస్వామి – గురుశరణ్ కౌర్ (వి. 1958)
  సంతానము – ఉపీందర్ సింగ్, దమన్ సింగ్, అమృత్
  మతం – సిక్కులు
   భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యుడైన సింగ్ ప్రధాన మంత్రిగా 2004 మే 22 లో బాధ్యతలు స్వీకరించారు. అనేక అర్హతలు కల సింగ్ 1991లో ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణ ల వలన ప్రస్తుత భారత చరిత్రలో ముఖ్యుడిగా భావింపబడుతున్నాడు. మరియు ఇంతటి విద్యా మరియు సేవలలో అనుభవం కలిగిన ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడంటో అతిశయోక్తిగాదు.