భూధార్ కు శ్రీకారం- నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

  0
  19

  రాష్ట్రంలోని ప్రతి భూభాగం, స్థిరాస్తికి విశిష్ట సంఖ్య (11 అంకెలతో) అందించే ‘భూధార్’ కార్యక్రమంను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నవంబర్ 20న ప్రారంభించారు.

  ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద భూదార్ కి సంబంధించిన ‘భూసేవ’ పోర్టల్ ను ఆయన ఆవిష్కరించారు. భూసేవ ప్రాజెక్టులో భాగంగా భూధార్ ను చేపట్టారు. వేలిముద్రలు, కనుపాపల ఆధారంగా మనుషులకు ఆధార్ ఇచ్చినట్లుగా.. భూములు, ఆస్తుల గుర్తింపునకు సర్వేనెంబర్లు, సబ్డివిజన్ల ఆధారంగా అక్షాంశ, రేఖాంశాలతో భూధార్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని 2.84 కోట్ల వ్యవసాయ భూములు, 0.32 కోట్ల పట్టణ ఆస్తులు, 0.84 కోట్ల గ్రామీణ ఆస్తులకు భూధార్ కేటాయించనున్నారు. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్, పంచాయతీ, పురపాలక, అటవీ శాఖలు ఈ ప్రాజెక్టులో భాగం పంచుకోనున్నాయి.

  భూధార్ పథకంను మొదటగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో 2018 ఏప్రిల్ 11న ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చారు. భూ సేవ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 20 రకాల సేవలను అందించనున్నారు. దేశంలో ఏరాష్ట్రంలోనూ లేని విధంగా రాష్ట్ర రెవెన్యూశాఖ నూతన సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో దేశ పౌరులకు ఆధార్‌ ఏవిధంగా చట్టబద్దత చేసిందే అదే విధంగా రాష్ట్ర రెవెన్యూశాఖ ‘భూధార్‌’ కార్డును నేడు లాంఛనంగా ప్రారంభించనుంది. 11 అంకెలతో కూడిన విశిష్ట సంఖ్యను భూ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాస ప్రాంగణంలోగల ప్రజావేదిక సమావేశ మందిరంలో రాష్ట్ర స్థాయిలో భూసేవ ద్వార ప్రతి భూమికి, స్థిరాస్థికి ఆధార్‌ తరహాలో భూధార్‌ 11 అంకెల విశిష్ట సంఖ్యను అందించే ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడులాంఛనంగా ప్రారంభించను న్నారు. దీనికి సంబంధించిన పైలెట్‌ ప్రాజెక్టును 2018 ఏప్రిల్‌ 11న రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రారంభించిన విషయం తెలిసిందే. పైలెట్‌ ప్రాజెక్టు విజయవంతం కావడంతో భూ సేవను రాష్ట్రంలో భూ వివాదాలను అరికట్టడంతో పాటు రాష్ట్రంలోని భూముల సమగ్ర సమాచారం ఒకేచోట లభ్యమయ్యేలా రూపకల్పన చేశారు.
  భూసేవ కార్యక్రమం రెవెన్యూ, పంచాయితీరాజ్‌, మున్సిపల్‌, రిజిస్ట్రేషన్‌, సర్వే, అటవీ, దేవాలయాలు, వక్ఫ్‌తో మొత్తం 8 శాఖల సమన్వయంతో పనిచేయనుంది. భూసేవలో 20 రకాల సేవలతో అందిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రజలకు ఖచ్చితమైన, సురక్షితమైన వ్యవస్థగా చెప్పవచ్చునని చీఫ్‌ కమీషనర్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ మరియు భూసేవ చైర్మన్‌ డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ వెల్లడించారు. ప్రస్తుతం 10 రకాల సేవలు అందుబాటులోకి రాగా, ఈ డిసెంబరు నాటికి మరో 10 సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. దేశంలోనే ఈ తరహా ప్రాజెక్ట్‌ ఇప్పటి వరకూ ఎక్కడా అమలులోలేదని, ప్రప్రథమంగా మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్నట్లు డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ చెప్పారు.
  ఒక్క క్లిక్‌తో భూమికి సంబంధించిన సమగ్ర సమా చారాన్ని అందించే భూసేవ పథకం రెవెన్యూ చరిత్రలో ఒకమైలురాయిగా నిలిచిపోనున్నది. రెవెన్యూశాఖను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఇది ఎంతో దోహదపడు తుందన్నారు. భూసేవ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ-దేవా దాయ) కే.ఈ.కృష్ణ మూర్తి, పంచాయితీరాజ్‌శాఖామంత్రి నారా లోకేష్‌ ఇతర మంత్రులు పాల్గొననున్నారు.