భారత షూటర్లకు స్వర్ణం

  0
  7

  భారత యువ షూటర్లు మను భాకర్‌, సౌరభ్‌ చౌదరి ఆసియా ఎయిర్‌గన్‌ చాంపియన్‌షిప్‌లో అదరగొట్టారు.

   మను-సౌరభ్‌ జోడీ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పి సత్తాచాటింది. తైపీలోని తైయువాన్‌లో బుధవారం జరిగిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో మను-సౌరభ్‌ జంట 784 స్కోరుతో వరల్డ్‌ రికార్డు సాధించింది.

  ఇక ఐదు జట్లు పోటీపడిన ఫైనల్లో భారత జోడీ 484.8 స్కోరుతో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. హవాంగ్‌ సియోన్‌జెయున్‌-కిమ్‌మో్‌స (కొరియా) జోడీ 481.1 స్కోరుతో రజత పతకం గెలవగా.. వూ చై యింగ్‌-కౌ కువాన్‌ టింగ్‌ జంట 413.3 స్కోరుతో కాంస్య పతకం దక్కించుకుంది.

  మరో భారత జోడీ అభిషేక్‌ వర్మ-అనురాధ 371.1 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక, ఇదే టోర్నమెంట్‌ జూనియర్‌ కేటగిరీలో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన ఇషా సింగ్‌-విజయ్‌వీర్‌ సిద్ధూ జోడీ స్వర్ణ పతకం సాధించింది. కొరియా జట్టుకు రజతం, చైనీస్‌ తైపీ జోడీకి కాంస్య పతకం దక్కాయి.

   ఇది పన్నెడవ ఆసియా ఎయిర్‌గన్‌ చాంపియన్‌షిప్‌.