భారత వైమానిక దళంలో ఎంఐ-17 వి5 నడిపిన మొదటి మహిళా బృందం

    0
    7

    భారత వైమానిక దళంలో ఎంఐ-17 వి5 హెలికాప్టర్‌ నడిపిన మొదటి పూర్తి మహిళా బృందంగా హీనా జైశ్వాల్‌ (ఫ్లైట్‌ ఇంజినీర్‌), పరుల్‌ భరద్వాజ్‌ (కెప్టెన్‌), అమన్‌ నిధి (కో పైలట్‌), రిచా అధికారి (ఇంజినీరింగ్‌ అధికారి) రికార్డులకు ఎక్కారు.

    నైరుతి వైమానిక స్థావరంలోని యుద్ధశిక్షణ కార్యక్రమాల్లో భాగంగా సంక్లిష్ట ప్రాంతాల నుంచి గాల్లోకి ఎగరడం, సురక్షితంగా దిగడం వంటి కార్యక్రమాలను ఈ బృందం విజయవంతంగా ముగించింది.

    కొన్ని రోజులకు ముందే భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో విమానం ద్వారా యుద్ధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన తొలి మహిళగా భావనా కంఠ్ మే 22న చరిత్ర సృష్టించారు.

    మిగ్-21 బైసన్ విమానంపై పగటిపూట యుద్ధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉద్దేశించిన సిలబస్‌ను భావన పూర్తి చేశారని వాయుసేన అధికార ప్రతినిధి గ్రూప్ కెప్టెన్ అనుపమ్ బెనర్జీ చెప్పారు. ప్రస్తుతం రాజస్తాన్‌లోని బికనీర్‌లోని వైమానిక స్థావరంలో భావన విధులు నిర్వర్తిస్తున్నారు.

    2017 నవంబర్‌లో ఫైటర్ స్క్వాడ్రన్‌లో చేరిన భావన, గతేడాది మార్చిలో తొలిసారిగా సొంతంగా మిగ్-21 బైసన్ యుద్ధ విమానాన్ని నడిపారు. యుద్ధ విమానాలను నడిపేందుకు మహిళలకూ అవకాశమివ్వాలని మోదీ ప్రభుత్వం తొలి నాళ్లలో నిర్ణయం తీసుకుంది.