భారత వాయుసేనలో చేరిన అపాచీ అటాక్‌ హెలికాప్టర్‌

  0
  7

  తొలి అపాచీ అటాక్‌ హెలికాప్టర్‌ను అమెరికా నేడు అధికారికంగా భారత వైమానికదళానికి అప్పగించింది.

  ⇒ అరిజోనాలోని బోయింగ్‌ ఉత్పత్తి కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భారత వైమానిక దళం తరఫున ఎయిర్‌ మార్షల్‌ ఏఎస్‌ బుటోలా తొలి అపాచీని స్వీకరించారు.

  ⇒ యూఎస్‌ నుంచి 22 అపాచీ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు 2015 సెప్టెంబరులో ఐఏఎఫ్‌.. అమెరికా ప్రభుత్వం, బోయింగ్‌తో ఒప్పందం చేసుకుంది.

  ⇒ ఈ ఏడాది జులై నాటికి తొలి విడత హెలికాప్టర్లు భారత్‌కు రానున్నాయి. ‘భారత వాయుసేనలోకి అపాచీ హెలికాప్టర్లు రావడం ఐఏఎఫ్‌ హెలికాప్టర్ల ఆధునికీకరణలో కీలక ముందడుగు. వాయుసేన భవిష్యత్‌ అవసరాలకు ఈ హెలికాప్టర్‌ ఎంతో అనువైనది.’ అని ఐఏఎఫ్‌ ట్వీటర్‌లో పేర్కొంది.

  ⇒ అపాచీ హెలికాప్టర్లకు గాలిలో, భూమి మీద దాడి చేయగల సామర్థ్యం ఉంటుంది.

  ⇒ ఈ హెలికాప్టర్‌ చాలా శక్తివంతమైంది. దాదాపు 10 టన్నులకు పైగా పేలోడ్‌ను ఇది తీసుకెళ్లగలదు. అంటే ఎం777 శతఘ్నులు, జీపులను  ఒక చోట నుంచి మరో చోటుకు తేలిగ్గా తరలించగలదు.