భారత ఫుట్ బాల్ కోచ్‌గా ఐగర్‌ స్టిమాక్‌

    0
    12

    క్రొయేషియాకు చెందిన ఐగర్‌ స్టిమాక్‌ భారత ఫుట్‌బాల్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు.

    గురువారం ఇక్కడ సమావేశమైన అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పదవి కోసం స్టిమాక్‌తో పాటు లీ మిన్‌ సంగ్‌ (దక్షిణ కొరియా), ఆల్బర్ట్‌ రోకా (స్పెయిన్‌), హకాన్‌ ఎరిక్సన్‌ (స్వీడన్‌)తో దరఖాస్తు చేశారు. వీరిలో స్టిమాక్‌ నేరుగా ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. మిగతావారు స్కైప్‌ ద్వారా మాట్లాడారు.

    • అనంతరం సుదీర్ఘంగా చర్చించిన కమిటీ… స్టిమాక్‌ వైపు మొగ్గింది. 51 ఏళ్ల స్టిమాక్‌ సెంటర్‌బ్యాక్‌గా 53 అంతర్జాతీయ మ్యాచ్‌లాడాడు.

    • 1996 యూరో కప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 1998 ప్రపంచ కప్‌లో మూడో స్థానంలో నిలిచిన క్రొయేషియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

    • 2012–13 మధ్య తమ దేశ జటు కు కోచ్‌గా వ్యవహరించాడు. ఈయన ఆధ్వర్యంలోనే క్రొయేషి యా 2014 ప్రపంచ కప్‌నకు అర్హత సాధించింది.

    • స్టిమాక్‌ మూడేళ్ల పాటు భారత కోచ్‌గా ఉండనున్నాడు. థాయ్‌లాండ్‌లో జూన్‌ 5 నుంచి జరుగనున్న కింగ్స్‌ కప్‌తో అతడి పదవీ కాలం ప్రారంభమవుతుంది.