బ్రహ్మోస్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

  0
  10

  గగనతలం నుంచి ప్రయోగించే ఈ క్షిపణిని సు-30 ఎంకేఐ యుద్ధవిమానం నుంచి పరీక్షించారు.

  • భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) మే 22న సూపర్‌ సోనిక్‌ బ్రహ్మోస్‌ క్రూయిజ్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.

  • 2.5 టన్నుల బరువుండే గగనతలం నుంచి నేలపైకి ప్రయోగించగలిగే ఈ క్షిపణి 300 కి.మీ. వరకు లక్ష్యాలను ఛేదించగలుగుంది.
  ఇది శబ్దంకన్నా మూడురెట్లు ఎక్కువ వేగంతో పయనిస్తుంది.

  • ఈ క్షిపణి ఐఏఎఫ్‌ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని సైనిక అధికారులు పేర్కొన్నారు. యుద్ధవిమానం ద్వారా క్షిపణి పరీక్ష సాఫీగా సాగిందని, నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిందని ఐఏఎఫ్‌ అధికార ప్రతినిధి అనుపమ్‌ బెనర్జీ వెల్లడించారు.

  • 2017 నవంబర్‌ 22న ఈ తరహా విభాగంలోని క్షిపణితో గగనతలం నుంచి ఉపరితలంపై లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడం ద్వారా ప్రపంచంలోనే తొలి వైమానిక దళంగా ఐఏఎఫ్‌ పేరొందింది. తాజా పరీక్ష రెండోది