బోయింగ్‌ 737 మాక్స్‌’లపై భారత్‌ నిషేధం

  0
  5

  ‘బోయింగ్‌ 737 మాక్స్‌’లను పక్కన పెట్టిన జాబితాలో భారత్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ కూడా చేరాయి.

  ఈ విమానాలను తక్షణమే విమానాశ్రయాలకు పరిమితం చేయాలని డీజీసీఏ నిర్ణయించింది. ప్రయాణికుల భద్రతే అతిముఖ్యం.

  భద్రతాపరంగా అన్నీ పరిశీలించే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ట్వీట్‌ తెలిపింది . మనదేశంలో స్పైస్‌జెట్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ రకం విమానాలను కలిగి ఉన్నాయి.

  మరోవైపు తమ దేశంలోగాని, తమ దేశం పరిధిలోని ఆకాశంలోగాని స్వదేశీ, విదేశీ విమానయాన సంస్థలకు చెందిన 737 మాక్స్‌ విమానాలు ఎగరడానికి వీల్లేదని బ్రిటన్‌ పౌర విమానయాన సంస్థ ఆదేశించింది. ఐరోపా సమాఖ్యకూడా తమ గగనతలంలో ఈ శ్రేణి విమానాలను నిషేధించింది.

  *సింగపూర్‌, చైనా, మలేసియా, ఇథియోపియా, ఆస్ట్రేలియాదేశాలూ తాత్కాలికంగా విమానాశ్రయాలకే పరిమితం చేశాయి.
  *బోయింగ్‌ 737 మాక్స్‌’లను పక్కన పెట్టిన దేశాలు: భారత్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ