ఫోర్బ్స్ సెలబ్రిటీల జాబితాలో సల్మాన్‌కు అగ్రస్థానం

  0
  7

  ఫోర్బ్స్ మేగజైన్ రూపొందించిన ‘ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ’ల జాబితాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచాడు.

   
  2017 అక్టోబర్ నుంచి 2018 సెప్టెంబర్ మధ్య దేశంలో అత్యధిక సంపద ఆర్జించిన 100 మంది ప్రముఖులతో రూపొందించిన ఈ జాబితాను డిసెంబర్ 5న ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో రూ. 253.25 కోట్ల ఆదాయంతో సల్మాన్ వరుసగా మూడోసారి మొదటిస్థానం దక్కించుకున్నాడు. అలాగే రూ. 228 కోట్ల 9 లక్షల ఆదాయంతో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో స్థానం పొందాడు.

  ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీల జాబితా

  ర్యాంకు

  పేరు

  సంపద(రూ.కోట్లలో)

  1

  సల్మాన్ ఖాన్

  253.25

  2

  విరాట్ కోహ్లీ

  228.09

  3

  అక్షయ్ కుమార్

  185

  4

  దీపికా పదుకోన్

  112.8

  5

  మహేంద్ర సింగ్ ధోని

  101.77

  6

  అమీర్ ఖాన్

  97.5

  7

  అమితాబ్ బచ్చన్

  96.17

  8

  రణ్ వీర్ సింగ్

  84.67

  9

  సచిన్ టెండూల్కర్

  80

  10

  అజయ్ దేవగణ్

  74.5

  14

  రజనీకాంత్

  50

  20

  పీవీ సింధు

  36.50

  24

  పవన్ కల్యాణ్

  31.33

  28

  జూనియర్ ఎన్టీఆర్

  28

  33

  మహేశ్‌బాబు

  24.33

  34

  సూర్య

  23. 67

  36

  నాగార్జున

  22.25

  39

  కొరటాల శివ

  20

  58

  సైనా నెహ్వాల్

  16.54

  64

  అల్లు అర్జున్

  15.67

  72

  రామ్‌చరణ్

  14

  72

  విజయ్ దేవరకొండ

  14

   
   
  ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీల జాబితాలో మహిళల్లో దీపికా పదుకోన్ అగ్రస్థానం పొందింది. అలాగే క్రీడాకారుల విభాగంలో విరాట్ కోహ్లి తొలి స్థానంలో ఉండగా… మహిళల క్రీడాకారిణుల జాబితాలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మొదటి ర్యాంక్‌లో నిలిచింది.