ప్రపంచ సుందరిగా వెనెస్సా పోన్స్

    0
    17

    ప్రపంచ సుందరి-2018గా మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్ డి లియోన్ నిలిచింది.

    చైనాలోని సన్యా పట్టణంలో డిసెంబర్ 8న జరిగిన అందాల పోటీల్లో 26ఏళ్ల వెనెస్సా విజయం సాధించి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన నికోలేనే పిచప లిమ్‌స్నుకన్ మొదటి రన్నరప్‌గా నిలిచింది. అలాగే మారియా వసిల్విచ్(బెలారస్), కదీజా రాబిన్సన్(జమైకా), క్విన్ అబేనక్యో(ఉగాండా)లు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఈ పోటీల్లో మొత్తం 118 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొన్నారు. 2017లో ప్రపంచ సుందరి కిరీటాన్ని భారత్‌కు చెందిన మానుషీ ఛిల్లర్ సొంతం చేసుకుంది.